Site icon Prime9

Horoscope Today: నేటి రాశిఫలాలు..

daily horoscope details of different signs on july 17 2023

daily horoscope details of different signs on july 17 2023

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఈ రోజు సమాజంలో పలుకుబడి వున్నవ్యక్తులతో పరిచయం జరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగులకు పనిభారం పెరిగినా అధికారులను మెప్పిస్తారు. దూరప్రాంతం నుంచి ఒక ముఖ్యమైన వార్త మీకు ఆనందాన్నిస్తుంది. బంధు, మిత్రులను కలుస్తారు. ఆర్దిక సంబంధిత వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ, వ్యాపారాల్లో సహనం పాటించాలి. ఆర్దిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న విషయం ఒకటి పరిష్కారం కావడం లేదా అనుకూలంగా ఉండటం జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ, వ్యాపారాల్లో వత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యులను సంప్రదించి తీసుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్త.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగులకు పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణాలు ఉండే అవకాశముంది. ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబ సభ్యులను సంప్రదించి తీసుకోవడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ముఖ్యమైన పనులను వాయిదా వేయకుండా ప్రణాళికాబద్దంగా చేయండి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆర్దికపరమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో బాగా కష్టపడవలసి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబసభ్యులతో సంప్రదించి తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకంగా ఉంటాయి. స్దిరాస్తులకు సంబంధించి కొంత మొత్తం చేతికందే అవకాశముంది. ఆర్దిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి. పిల్లలకు సంబంధించి ముఖ్యమైన వార్త వింటారు. ప్రయాణాల్లో జాగ్రత్త.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం 4, ధనిష్ట 2)
ఉద్యోగ, వ్యాపారాల్లో వత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనులు నిదానంగా సాగుతాయి. కొందరు వ్యక్తుల ప్రవర్తన మీకు చిరాకు కలిగిస్తుంది. ఆర్దికపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం 4, పూర్వాభాద్ర 1,2,3)
చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. పై అధికారులను మెప్పిస్తారు. దూరప్రాంతం నుంచి ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో పలుకుబడి వున్న వ్యక్తులను కలుస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి ఉద్యోగాల్లో వత్తిడి ఎక్కువగా ఉన్నా ఫలితాలను సాధిస్తారు. మీ పనితీరు, నిజాయితీ అధికారులను మెప్పిస్తుంది. ఆర్దిక, ఆరోగ్యవిషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబసభ్యులను సంప్రదించి మఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి.

Exit mobile version