Site icon Prime9

Horoscope 17 July: నేటి రాశి ఫలాలు..

daily horoscope details of different signs on july 17 2023

daily horoscope details of different signs on july 17 2023

17 July Horoscope: 

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1))  ఆదాయం పెరుగుతుంది.  ఒక శుభవార్త వింటారు.  వృత్తి వ్యాపారాల్లో ఆశించినమేరకు లాభాలు వుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలి.

 

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో వత్తిడి వుంటుంది. సంయమనం పాటించాలి. సంతానానికి సంబంధించి ఒక ముఖ్యమైన వార్త వింటారు.  ఆరోగ్యం జాగ్రత్త.

 

మిథునం (మృగశిర 3,4, ఆర్ర, పునర్వసు 1,2,3) వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగావుంటాయి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.

 

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ముఖ్యమైన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయానికి సంబంధించి శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా వుంటాయి.

 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1). ఉద్యోగంలో అధికారులు బాధ్యతలను పెంచుతారు. వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారుల ఆర్థిక పరిస్టితి మెరుగ్గా ఉంటుంది.

 

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) . తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. వ్యాపారులకు కలిసి వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

 

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ధనలాభం వుంది.

 

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) ఉద్యోగంలో  వత్తిడివుంటుంది వ్యాపారంలో కలిసి వస్తుంది. స్పెక్యులేషన్‌ లాభిస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది.  ఆరోగ్యం జాగ్రత్త.

 

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగంలోపైవారిని మెప్పిస్తారు. వ్యాపారపరంగా లాభాలున్నాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి.

 

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం 4, ధనిష్ట 2) మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వృద్ధికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

 

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం 4, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారులకు ఆర్థికంగా కలిసి వస్తుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.  .

 

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగంలో  అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. మిత్రుల సహకారం లభిస్తుంది వ్యాపారులు తలపెట్టిన పనులు పూర్తవుతాయి.

 

Exit mobile version
Skip to toolbar