Site icon Prime9

Horoscope Today : రాశి ఫలాలు ( గురువారం సెప్టెంబర్ 8, 2022 )

daily horoscope details

daily horoscope details

Horoscope Today : రాశి ఫలాలు ( గురువారం సెప్టెంబర్ 8, 2022 )

1. మేష రాశి

ఇంట్లో మీ పరిస్థితిలు గందరగోళం చేస్తాయి.అనుకోకుండా ప్రయాణాలు చేయాలిసి వస్తుంది.ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంది. కొత్త పరిచయాలు జరుగుతాయి కానీ అందరిని నమ్మకండి. మీ జీవిత భాగస్వామి మీ మీద కొండంత ప్రేమను చూపిస్తుంది.

2 . వృషభ రాశి

ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.డబ్బును ఎక్కువ ఖర్చు పెట్టకండి. ఒక సారి ఖర్చు పెట్టింది వెనక్కి రాదు. ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. మీ పనిలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు నచ్చి నట్టుగా మారుతుంది.

3. మిథున రాశి

ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్ధిక సమస్యల ఇంకా ఎక్కువ అవుతాయి. మీ పిల్లలను బాగా చూసుకోండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మీ మనసులో ఉన్నది చెప్పేయండి. మీ వైహహిక జీవితం సంతోషంగా సాగుతోంది.

4. కర్కాటక రాశి

మీ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.మీ భాగస్వామితో మీ సమస్యలు గురించి చెప్పండి. ఈ రోజు మీతో మీరు సమయాన్ని కేటాయిస్తారు.డబ్బును ఎక్కువ ఖర్చు చేయకండి. మీకు డబ్బు విలువ తొందరలో తెలియనుంది. మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి.

5. సింహ రాశి

మీరు చాలా కష్ట పడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. మీ ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు. మెరుగుపడతాయి. మీ కుటుంబలో చిన్న పిల్లలను దగ్గరికి తీసుకోండి. మీ ప్రేమ ప్రయాణంలో కొత్త చిక్కులు, సమస్యలు వస్తాయి. ఈ రోజు ఒకరి అన్న మాటలు పట్టించుకోరు మీ పని ఏంటో మీది చేసుకొని వెళ్తారు.

6. కన్యా రాశి

ఒత్తిడి తగ్గించుకోవాడానికి వ్యాయామాలు చేయాలిసి వస్తుంది. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులకు మీ సమయాన్ని కేటాయిస్తారు. మీ ప్రేమ ప్రయాణం మొదలవ్వబోతుంది. మీ జీవిత భాగస్వామి మీతో గొడవలు పడతారు.

7. తులా రాశి

మీ జీవితంలో మీకు ఒక కొత్త వ్యక్తి పరిచయమవ్వబోతున్నారు. నిర్ణయాలు మీ అంతటి మీరే తీసుకోకండి. మీ కుటుంబ సభ్యుల చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఆఫీసులో ఒక మంచి మార్పు చూసి చాలా సంతోషపడతారు.
ఎన్ని పనులున్నా మీతో మీరు సమయాన్ని గడపండి. మీ జీవిత భాగస్వామితో మీతో కొన్ని విషయాలు చెప్తారు.

8. వృశ్చిక రాశి

ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు. ఈ రోజు ఒక శుభ వార్త వింటారు. మీ కోపాన్ని అదుపు చేసుకోండి. లేదంటే చాలా నష్ట పోవాలిసి వస్తుంది. అందరిని నమ్మకండి.ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు మంచి వార్తను చెప్పనున్నారు.

9. ధనస్సు రాశి

ఈ రోజు మీకు నచ్చినట్టు ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఖాళీ సమయాన్ని మీ పాత్ర మిత్రులకు కేటాయిస్తారు. ఈ రోజు మీ భాగస్వామి మీకు అందమైన బహుమతిని ఇస్తారు.

10. మకర రాశి

ఈ రోజు మీ ఆరోగ్య సమస్యలు తొలిగిపోతాయి. మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆఫీసులో మీరు చేసే పనికి మీకు మంచి గుర్తింపు వస్తుంది. మీ ప్రేమ ప్రయానానికి ముగింపు చెప్పాలిసి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో గొడవలు పడవచ్చు..

11. కుంభ రాశి

మీ కన్న కలలు నెరవేరతాయి. మీ అప్పు తీసుకున్న వారు తిరిగి ఇచ్చేస్తారు. ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. మీరు ప్రేమిస్తే వెళ్ళి ధైర్యంగా చెప్పండి. మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీ ఆర్ధిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. మీ జీవితం భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

12. మీన రాశి

మీరు కన్న కలల్లో చాలా వరకు నెరవేరతాయి. మీరు దేని గురించి బాధ పడాలిసిన అవసరం లేదు. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి గుర్తింపు వస్తుంది. మీ వైహహిక జీవితం మీకు నచ్చినట్టుగా మారుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

Exit mobile version
Skip to toolbar