Site icon Prime9

Horoscope Today : రాశి ఫలాలు ( గురువారం సెప్టెంబర్ 1, 2022)

daily horoscope details

daily horoscope details

Horoscope Today: రాశి ఫలాలు ( గురువారం సెప్టెంబర్ 1, 2022 )

1. మేష రాశి

జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు. డబ్బును ఎక్కువ ఖర్చు పెట్టకండి. మీ కుటుంబంలో చిన్న వారితో మీ సమయాన్ని గడపండి. మీకు బాధలు వచ్చినప్పుడు మీ పెద్ద వారితో పరిష్కరించండి.
ఈ రోజు మీ భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి . మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు కోపం తెప్పిస్తుంది.

2 . వృషభ రాశి

తిండి తినడం తగ్గించుకోవాలి దీని వల్ల బరువును తగ్గుతారు. మీ స్నేహితుల సాయం తీసుకొని మీకున్న సమస్యలను పరిష్కరించుకుంటారు. మీకు ఓర్పు చాలా అవసరం. మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే తిరిగి అనకండి అసలు ఆ మాటలు పట్టించుకోకండి. మీతో మీరు సమయాన్ని గడుపుతారు . పెళ్ళి చేసుకోని సంతోషంగా ఉండాలనుకుంటారు. మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకొని ఆమెతో ఉండండి.

3. మిథున రాశి

ఈ రోజు మీరు మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. మీరు ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయండి. మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతోంది . మీరు ఈ రోజు సంతోషంగా ఉంటారు. మీరు పని చేసే దగ్గర ఎదో చేయాలనుకుంటారు కానీ ఆ పనిని చేయలేరు. ఈ రోజు మీ భాగస్వామి వల్ల మీరు బాధ పడాలిసి వస్తుంది.

4. కర్కాటక రాశి

ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీ ఆరోగ్యం బావుంటుంది. ఎక్కువ ఖర్చు చేయకండి. మీ బంధువులతో ఎంత వరకు ఉండాలో అంత వరకు మాత్రమే ఉండండి . మీ ఖాళీ సమయాన్ని మీ పని కోసం ఉపయోగించుకుంటారు. మీరు మీ పని మీద మాత్రమే ధ్యాస పెట్టండి. మిమ్మల్ని సంతోష పెట్టాలని మీ భాగస్వామి ప్రయత్నాలు చేస్తోంది .

5. సింహ రాశి

ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించండి. మీ అప్పు మీకు తిరిగి వస్తుంది. మీ కుటుంబ సభ్యులతో మీ బాధలను చెప్పుకుంటారు. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి గుర్తింపు వస్తుంది. మీ స్నేహితులను కలుసుకుంటారు. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం ఇప్పటి నుంచి మంచిగా ఉండబోతుంది.

6. కన్యా రాశి

మీ ఆరోగ్య సమస్యలు నుంచి బయట పడతారు.
మీ ప్రేమ ప్రయాణం మొదలు అవ్వబోతుంది . మీరు ఎవరిని కలవడానికి ఇష్ట పడరు. మీతో మీరు మాత్రమే ఉండటానికి ఇష్ట పడతారు. ఈ రోజు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు అలాగే ప్రేమ కూడా దొరుకుతుంది.

7. తుల రాశి

మీరు బలంగా ఉండటానికి ప్రయత్నిస్తారు .పని
పని చేసేటప్పుడు శ్రద్ధ పెట్టండి. ఈ బంధువుల కొన్ని కొత్త సమస్యలు వస్తాయి. మీరు ఎవరని నమ్మకండి. మీరు డబ్బును బాగా సంపాదించాలి.
మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు అవుతాయి . దాని వల్ల మీకు కోపం ఎక్కువ అవుతుంది . పనిలో ఒత్తిడి పెరుగుతుంది.

8. వృశ్చిక రాశి

మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఒత్తిడిని దూరం చేయడానికి యోగ చేయండి. మీ ప్రేమ విషయంలో కొత్త ఇబ్బందులు , లేని పోనీ చిక్కులు వస్తాయి. ఐన మీరు ధైర్యాన్ని కోల్పోకండి. మీరు పని దగ్గర చేసేటప్పుడు కొంచం టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

9. ధనస్సు రాశి

ముందు ముందు మీకు అంతా మంచిగా ఉండబోతుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
మీ ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయి. మీరు ఈ రోజు ఒంటరిగా ఉండటానికి ఇష్ట పడతారు. కొన్ని విషయాల వల్ల మీకు కోపం ఎక్కువ అవుతుంది. మీ వైవాహిక జీవితం అందంగా ఉండబోతుంది.

10. మకర రాశి

మీ కోపం వల్ల మీరు చాలా కోల్పోవాలిసి వస్తుంది.
అలాగే మీ ప్రవర్తనలో కొత్త మార్పులు వస్తాయి. మీ స్నేహితులకు మీ సమయాన్ని కేటాయిస్తారు. మీ జీవితం మీకు కొత్త మలుపులను చూపిస్తుంది. అన్ని మీకు నచ్చినట్టే జరగవు . పరిస్థితులను బట్టి కొన్ని మారుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

11. కుంభ రాశి

మీకు కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ పిల్లలతో మీ సమయాన్ని గడపండి. వాళ్ళని బాధ పెట్టకండి. మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల మీరు దిగులుపడతారు. మీ జీవిత భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోండి.

12. మీన రాశి

మీరు అతిగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి . మీకు ఇష్టమైన వాళ్ళతో ఆనందంగా ఉంటారు. మీ పనిలో కొత్త మార్పులు వస్తాయి. దీని వల్ల మీకు కోపం వస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఇతరుల విషయంలో మాట్లాడకండి.
మీ ఖాళీ సమయాన్ని మీకు మాత్రమే కేటాయించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రేమగా మాట్లాడతారు.

Exit mobile version