Site icon Prime9

Horoscope: సెప్టెంబర్ 24 నుంచి ఈ మూడు రాశుల వారి జాతకం మారిపోనుంది !

Horoscope

Horoscope

Horoscope: ప్రస్తుతం రాశులు, జాతకాలు గురించి ఎక్కువ ఆరాలు తీస్తున్నారని ఓ సర్వేలో వెల్లడించారు. మనకి తెలియని విషయం ఏంటంటే గ్రహాల రాశి పరివర్తనం 12 రాశులపైన ప్రభావం ఉంటుంది. ఐతే కొన్ని సంతోషంగా, మరి కొన్ని దురదృష్టకరంగా ఉంటాయి.శుక్రుడు ఈ నెల 24 వ తేదీన కన్యా రాశి లోకి ప్రవేశించనున్నాడు.దాని ప్రభావం శుభ పరిణామాలుగా మారి ఈ మూడు రాశుల వారికి బాగా కలిసి రానుంది. ఆ మూడు రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

వృషభం రాశి :

డబ్బు పరంగా బాగా కలిసి రానుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్ర సంచారం ఈ రాశికి చెందిన వారికి మంచి జరగనుంది.ఈ రాశికి చెందిన వారు జీవిత సమస్యల నుంచి తొందరలోనే బయటపడతారు.పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి సమయం.ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి.అప్పుగా ఇచ్చిన డబ్బులు మీ వద్దకు వస్తుంది. నలుగురిలో గౌరవం పెరుగుతుంది.

మిథునం రాశి :
మీ బాధలు తొలిగిపోతాయి.ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి.శుక్రుడు మిథున రాశి లోకి ప్రవేశించడం వలన వారికి మంచి జరగనుంది.వ్యాపారులకు ఐతే పట్టిందల్లా బంగారమే. ఈ రాశికి చెందిన వారు ఈ వ్యాపారం చేసిన మంచి లాభాలు వస్తాయి.మీ ఆస్తి మీ వద్దకు చేరుకుంటుంది.ఆరోగ్య సమస్యల మీద దిగులు చెందకండి అవి కూడా తగ్గుముఖం పడతాయి.

కన్య రాశి : 

పెట్టుబడికి డబ్బు చేకూరుతుంది.శుక్రుడు స్వయంగా కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ రాశివారిపై శుక్ర సంచార ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది.ఈ రాశికి చెందిన వారి జీవితంలో ఊహించలేని మార్పులను చూస్తారు.డబ్బు పరంగా బాగా కలిసి రానుంది.పెట్టుబడి పెట్టె వ్యాపారులకు ఇదే మంచి సమయం. మీకున్న ఆరోగ్య సమస్యలు అన్ని తొలగిపోతాయి.

Exit mobile version