Site icon Prime9

Horoscope: అక్టోబర్ 2 నుంచి ఈ రాశుల వారి జాతకాలు మారనున్నాయి !

daily horoscope details

daily horoscope details

Horoscope: ప్రస్తుతం రాశులు, జాతకాలు గురించి ఎక్కువ ఆరాలు తీస్తున్నారని ఓ సర్వేలో వెల్లడించారు. మనకి తెలియని విషయం ఏంటంటే గ్రహాల రాశి పరివర్తనం 12 రాశులపైన ప్రభావం ఉంటుంది. ఐతే కొన్ని సంతోషంగా, మరి కొన్ని దురదృష్టకరంగా ఉంటాయి.బుధుడు అక్టోబర్ 2 వ తేదీన కన్యా రాశి లోకి ప్రవేశించనున్నాడు.దాని ప్రభావం శుభ పరిణామాలుగా మారి ఈ మూడు రాశుల వారికి బాగా కలిసి రానుంది. ఆ మూడు రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ధనుస్సు : బుధుడి ఈ రాశివారిలో ప్రవేశించడం వల్ల శుభవార్తలు వింటారు. అలాగే జాబ్ ఆందోళన తగ్గుతుంది ఎందుకంటే కొత్త జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. జాబ్ చేసే వారికి ప్రమోషన్ మరియు శాలరీ ఇంక్రిమెంట్ పొందవచ్చు. వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. పెట్టుబడులు పెట్టె వారు ఆలోచించాలిసిన అవసరం లేదు.. మీరు ఉద్యోగానికి సంబంధించి ఇతర దేశాల్లో పర్యటనలు చేసే అవకాశం ఉంది. ఆఫీసులో మీరు చేసే పనికి ప్రశంసలు దక్కుతాయి.

వృశ్చికం : మీ ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబంతో మీ సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.
ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. మీరు స్టాక్ మార్కెట్ లేదా లాటరీ టికెట్ ద్వారా ఇతర మార్గాల నుండి లాభాలను పొందే అవకాశం ఉంది. మీ బిజినెస్ మంచిగా సాగుతుంది.

సింహం : బుధుడు ఈ రాశికి ప్రవేశించడం ఎప్పటి నుంచో పెండింగ్ కోర్టు కేసుల నుండి విముక్తి పొందుతారు. ఈ రాశికి చెందిన వారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఉపాధ్యాయులు, లాయర్లు, మార్కెటింగ్ చేసేవారికి ఈ సమయం కలిసి వస్తుంది. మీ భాగస్వామికి, మీకు ప్రేమానుబంధం బల పడుతుంది. మీరు మాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు. పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి సమయం.

Exit mobile version