Site icon Prime9

Horoscope for Friday, March 14, 2025: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి!

Horoscope for Friday, March 14, 2025: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు.

మేషం – ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంటుంది. ప్రతి విషయంలో అనుకూలంగా ఉంటుంది. రావలసిన ధనం కొంతమేర చేతికి అందుతుంది. దైవ సందర్శన మేలు కలిగిస్తుంది.

వృషభం – నూతన ఉత్తేజంతో అడుగు ముందుకు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. నూతన ప్రణాళికను ఏర్పరచుకుంటారు. దానికి అనుగుణంగా అడుగులు వేస్తారు.

మిథునం – చేపట్టిన కార్యక్రమాలలో కొంత జాప్యత ఏర్పడుతుంది. కొంతమంది వ్యక్తులు మీపై చేసే వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. అటువంటి వారికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు.

కర్కాటకం – ప్రతి విషయంలోనూ మీ వైఖరి తేట తెల్లం చేస్తారు. మనం సరైన దారిలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా మనకు అనవసరం అనే ధోరణితో ముందుకు సాగుతారు.

సింహం – ఉద్యోగంలో స్వల్ప ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి. మీపై చాడీలు చెప్పేవారు అధికమవుతారు. కష్టపడి పని చేసుకున్న మనపై ఈ చాడీలు ఏంటి అని మానసిక సంఘర్షణకు లోనవుతారు.

కన్య – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్నేహితులతో కలిసి ఆహ్లాదకరంగా మెలగగలుగుతారు. లోన్లు సకాలంలో తీర్చడానికి సరైన ప్రణాళికలను రూపొందించుకుంటారు. రావాల్సిన ధనం చేతికి అందదు.

తుల – కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత ఆందోళనకర వాతావరణం ఏర్పడుతుంది. సంతానం విద్యా విషయంలో నూతన ప్రణాళికలు, కొత్త ఒప్పందాలు చోటుచేసుకుంటాయి.

వృశ్చికం – కొంతమంది గ్రూపులుగా చేరి ఉద్యోగంలో చికాకులు సృష్టిస్తారు. వాటన్నిటికీ మీ పనితనమే సమాధానంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటారు.

ధనున్సు – నూతన కోర్సులలో చేరాలనుకున్న వారికి అనుకూలం. పుణ్యక్షేత్రాల సందర్శన మానసిక సంతృప్తిని ఇస్తుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

మకరం – పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పెడతాయి. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

కుంభం – చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవడం వలన కొంత మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఎంత శ్రమపడినప్పటికీ ఆశించిన ఫలితం దక్కదు. ఇది కొంత నిరాశ కలిగించే అంశంగా మారుతుంది.

మీనం – వృత్తి సంబంధమైన వ్యవహారాలలో ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల శరీరం కొంత అలసటకు గురవుతుంది. దూరప్రాంతాలలో నున్న బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు.

Exit mobile version
Skip to toolbar