Site icon Prime9

Guru Raghavendra Puja: గురువారం పూట రాఘవేంద్రునికి పూజ చేస్తే సకల సంపదలు

Guru Raghavendra Puja: గురువారం రాఘవేంద్ర స్వామికి ప్రీతికరమైనది. రాఘవేంద్ర స్వామి బృందావనంలోకి ప్రవేశించింది ఈ రోజునే. మైసూరులోని మంత్రాలయంలో, బృందావనంలో జీవ సమాధి అయిన శ్రీ రాఘవేంద్రునికి గురువారం పూజలు ఘనంగా నిర్వహిస్తారు.

గురువారం పూట రాఘవేంద్రునికి చేసే పూజలు సకల సంపదలను ఇస్తాయి. ఏడు వారాలు రాఘవేంద్ర స్వామికి ఉపవసించి పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. గురువారం పూట ఇంటిని శుభ్రం చేసుకుని రాఘవేంద్ర స్వామి పటాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి.
”పూజ్యాయ రాఘవేంద్రాయ
సత్యధర్మ రతాయచ భజతాం
కల్పవృక్షాయ నమతాం
కామధేనవే”
ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే, అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి. ఈ మంత్రాన్ని పఠించిన తర్వాత ఉపవాసం వున్న వారు ధూపదీప నైవేద్యాలను సమర్పించి, రాత్రిపూట పాలు పండ్లను తీసుకోవచ్చు. స్వామికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆరు వారాలు ఎప్పటిలా పూజ చేసి, ఏడో వారం రాఘవేంద్ర స్వామికి తులసిమాలలు సమర్పించాలి. ఇలా నిష్టతో రాఘవేంద్ర స్వామిని ఏడు వారాలు ఉపవసించి పూజిస్తే అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి.

Exit mobile version