Breaking News

ఈనెల 30 నుంచి గోల్కొండ బోనాలు.. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్

21 st Jun 2022, UTC

Hyderabad: ఈనెల 30 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్ల పై గోల్కొండ కోట వద్ద సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించిందన్నారు. 

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. బోనాల సందర్భంగా జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పిస్తామన్నారు మంత్రి తలసాని. బోనాల నిర్వహణ కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox