Breaking News

గణేష్ విగ్రహాలు కూడ చైనా నుంచి దిగుమతా? : నిర్మలా సీతారామన్

26 th Jun 2020, UTC

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకంపై తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో వర్చువల్ సమావేశంలో మాట్లాడిన   కేంద్ర ఆర్దిక మంత్రి సీతారామన్ కీలకవ్యాఖ్యలు చేశారు. దేశంలో అందుబాటులో లేని, మన పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడం తప్పు కాదని ఆమె అన్నారు.

అయితే ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా సాంప్రదాయకంగా స్థానికంగా మట్టితో చేసిన గణేశ విగ్రహాల కొనుగోలుకు బదులుగా వాటిని కూడా చైనా నుండి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు. మనం తయారుచేసుకోలేమా.. ఇలాంటి పరిస్థితి ఎందుకో ఆలోచించాలన్నారు.

ఆఖరికి సబ్బుపెట్టె, ప్లాస్టిక్ వస్తువులు, పూజకు ఉపయోగించే అగర్ బత్తీలాంటి మనం ప్రతిరోజూ వాడే గృహోపకరణాలను దిగుమతి చేసుకోవడం స్వావలంబనకు తోడ్పడుతుందా అని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేకించి ఇటువంటి ఉత్పత్తులను భారతీయ సంస్థలు మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్‌ స్థానికంగా తయారుచేసినప్పుడు మాత్రమే  దేశ స్వావలంబన సాధ్యపడుతుందన్నారు.

దిగుమతులు తప్పు కాదు, అవి ఉత్పత్తిని ప్రోత్సహించడంతోపాటు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయని నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే, ఉపాధి అవకాశాలు, వృద్ధి లాంటి ప్రయోజనాలను తీసుకురాలేని దిగుమతులు స్వావలంబనకు, భారత ఆర్థిక వ్యవస్థకు సహాయపడవని పేర్కొన్నారు. స్థానికంగా తయారయ్యే అందుబాటులో ఉన్న వస్తువులను దిగుమతి చేసుకునే పరిస్థితి మారాలి. ఆత్మ నిర్బర్ అభియాన్ వెనుకున్న స్వయం ప్రతిపత్తి ఆలోచన ఇదేనని ఆమె  వివరించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox