Dhantrayodashi 2022 : హిందువుల ముఖ్య పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటి.ఈ ఏడాది ఈ పండుగను అక్టోబర్ 24న జరుపుకోనున్నారు.ఐతే ఈ పండుగకు ఒక రోజు మందు వచ్చే వేడుకను ధనత్రయోదశి అంటారు.అంటే ధనత్రయోదశి పండుగను అక్టోబరు 23న వస్తుందన్న మాట. ధనత్రయోదశి రోజున బంగారం, వెండి, కారు, ఇల్లు, వస్తువులు మెుదలైన వాటిని కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.ఐతే ధనత్రయోదశి రోజున ఏఏ వస్తువులను దానం చేస్తారో తెలుసుకుందాం.
వీటిని దానం చేయండి
ధాన్యం
ధనత్రయోదశి రోజున ధాన్యాన్ని దానం చేసిన వారు మంచి ఫలితాలను పొందుతారు.వారికి ఇంట్లో ఎప్పుడు ఆహార ధాన్యాలకు కొరత ఉండదు.దీనితో పాటు ఈ రోజు వీలైతే పేదలకు ఆహారం పెట్టండి.
ఇనుము
ధనత్రయోదశి రోజున ఇనుము దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు.ఈ రోజున ఇనుమును దానం చేయడం వల్ల మీ జీవితంలో అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతారు. అంతేకాకుండా ముందు నుంచి పెండింగ్ లో ఉన్న పనులన్ని పూర్తి చేస్తారు.