Site icon Prime9

Horoscope: నేటి రాశి ఫలాలు (మంగళవారం, 06 డిసెంబర్ 2022)

daily horoscope details

daily horoscope details

Horoscope: ఈ రోజు అన్నిరాశుల వారికి చాలా ఒక శుభదినంగా ఉంటుంది. అందరూ చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా తమతమ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. చాలా మంది ఈ రోజు ఆర్థిక లాభాలను పొందుతారు. అన్నిరాశుల వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది.

1.మేష రాశి
ఈ రోజు మీ వ్యక్తిత్వం మరింత వికసిస్తుంది. సురక్షితమైన స్టాక్స్ లో మదుపు చెయ్యడం ఉత్తమం. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. షాపింగ్స్ లేదా సినిమాలకు కుటుంబ సభ్యులతో వెళ్తారు.

2.వృషభ రాశి
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్ధికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇది మీకు ఆర్ధికలాభాన్ని చేకూరుస్తుంది.
మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

3. మిథున రాశి
మీ ఓర్పుని కోల్పోకండి, ప్రత్యేకించి, క్లిష్ట సమయాలలో సహనంగా ఉండడం చాలా మంచిది. అసలు అనుకోని మార్గాల ద్వారా డబ్బు సంపాదింగలుగుతారు.
మీ జీవితం మారడానికి మీ శ్రీమతి మీకు సహాయం చేస్తారు. ఉద్యోగంలో మీరు ప్రశంసలు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా గడుపుతారు.

4. కర్కాటక రాశి
మీకు ఈరోజు కాస్త విశ్రాంతి అవసరం. ఈరోజు, కొంత మంది వ్యాపారవేత్తలు వారిప్రాణస్నేహితుడి సహాయమువలన ఆర్ధిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనము వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును. ఉద్యోగంలో మీరు ప్రశంసలు పొందుతారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.

5. సింహ రాశి
మీశక్తిని తిరిగి పొండడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. బ్యాంకు లావాదేవీలను ఆచితూచి జాగ్రత్త వహించి చెయ్యవలసి ఉన్నది. ఈరోజు కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో, మీరు ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

6. కన్యా రాశి
సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్) పొందుతారు. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ, ఎలా ఖర్చుపెట్టాలో తెలుసుకుంటారు. వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం, ఏకాగ్రతతో మీ పనిచెయ్యాల్సి ఉంటుంది. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

7. తులా రాశి
అసౌకర్యం మీకు మానసిక అశాంతి కలిగించవచ్చును. కానీ మీస్నేహితుడొకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేస్తాడు. టెన్షని వదిలించుకోవడానికి చక్కని మంత్రమైన సంగీతాన్ని వినండి. బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆరోగ్యపరం బాగుంటారు. ఉద్యోగస్థులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.

8. వృశ్చిక రాశి
మతపరమయిన భావనలతో మతసంబంధమైన చోట్లకి వెళ్ళే అవకాశం ఉన్నది. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్స్ లో మదుపు చెయ్యాలి. మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి. ఎందుకంటే, అది మీకు చాలా మేలు చేస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలను చూస్తారు. మీ బెటర్ హాఫ్ తో ఆనందంగా ఉంటారు.

9. ధనస్సు రాశి
అనుకోకుండా వచ్చే డబ్బుతో అకస్మాత్తుగా మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. ఇంటి విషయాలు కొన్నిటిని, అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాల్సి వస్తుంది. మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఉత్తమమైన రోజు. ఉద్యోగ రీత్యా మంచి ప్రశంసలను పొందుతారు. మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడుస్తుంది.

10. మకర రాశి
ఈ రోజు మీరు రిలాక్స్ అవ్వాలి. మీ కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి. మీరు డబ్బులను పొదుపుచేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది.
మీ ఆరోగ్యం జాగ్రత్త.  మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మీరు సన్నిహితులు లేదా స్నేహితులతో చాలా సరదాగా గడుపుతారు. ఉద్యోగులకు ఉన్నాతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.

11. కుంభ రాశి
ఈరోజు ఈరాశిలో ఉన్నవారికి వారి యొక్క సంతానము వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ సంతానమును చూసి మీరు గర్వపడతారు. మిత్రులతో గడిపే సాయంత్రాలు, చాలా చక్కటి వినోదకారకంగానూ మరియు సంతోషకరంగానూ ఉంటాయి. మీయొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది.

12. మీన రాశి
మీ పెట్టుబడులు, భవిష్యత్తు గమ్యాలను గురించి గోప్యతను పాటించండి. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం, మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి ప్రశంసలు పొందుతారు.

 

Exit mobile version