Site icon Prime9

Horoscope: నేటి రాశి ఫలాలు (30 సెప్టెంబర్ 2022)

daily horoscope details

daily horoscope details

Horoscope Today: ఈరోజు అన్ని రాశులవారికి అనుకూలంగా ఉంటుంది. కాస్త అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కుటుంబంతో గడపడం ఉత్తమైన మార్గం. చూసి డబ్బు ఖర్చు పెట్టాలి. ఆర్ధికంగా ఈ రోజు అన్ని రాశుల వారికి మెరుగ్గా ఉంటుంది.

1.మేష రాశి

ప్రతి సమస్యకు చిరునవ్వుతో సమాధానం వెతుక్కుంటారు. సమస్య అని ఎవరైనా మీ దగ్గరు వస్తే వాటికి కాస్త దూరంగా ఉండండి. అది మీ మానసిక ప్రశాంతతకు చాలా మంచిది. ఈ రోజు శ్రమ పడాలిసి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. పనికి తగిన గుర్తింపు వస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో అద్బుతమైన క్షణాల్ని గడుపుతారు.

2 .వృషభ రాశి

ఈ రోజు ఈ రాశి వారు ఉమ్మడి వ్యాపారాలకు పూనుకోవద్దు. భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నించవచ్చును తద్వారా మీరు నష్టపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. మీ వైహహిక జీవితం మంచిగా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

3. మిథున రాశి

ప్రతి సమస్యకు చిరునవ్వుతో సమాధానం వెతుక్కుంటారు. మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి యోగా చేయండి. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి రోజుగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

4. కర్కాటక రాశి

మొత్తం మీద ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. కానీ ప్రయాణాలు మీకు అలసటను ఒత్తిడిని కలిగిస్తాయి. ఈరోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురికాకుండా జాగ్రత్తగా చూసుకోండి. అప్పు ఇచ్చిన వారి దగ్గర వసూలు చేసుకుంటారు. జీవితంలో ఆనంద సమయం గడపడం కోసం కాస్త మీ సమయాన్ని కుటుంబ సభ్యుల కోసం గడపండి.

5. సింహ రాశి

వృత్తిలో మీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. మీరు పనిచేసే దగ్గర మంచి ఫలితాలను ఇవ్వడం కోసం శ్రమించి పనిచేస్తారు. ఈ రోజు మీరు ఇది వరకుటి కంటే ఆర్ధికంగా బాగుంటారు. మీ దగ్గర తగినంత ధనము కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో శాంతి పూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడుపుతారు. గతంలో మొదలు పెట్టిన పనులను పూర్తి చేస్తారు.ప్రతి చిన్న దానికి టెన్షన్ పడకండి కొంచం సమయం తీసుకొని శాంతంగా ఆలోచించండి.

6. కన్యా రాశి

మానసిక ప్రశాంతత కోసం, ఏదో ఒక దానం చెయ్యడం ఉత్తమం. పనులలో లీనమవ్వండి. మీ ఖర్చులను అదుపులో పెట్టుకోండి. మీ ఛార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి తోడ్పడతాయి. మంచి ఆరోగ్యం కోసం రోజూ బాదం తింటూ ఉండండి. మీ వైవాహిక జీవితం ఈరోజు బాగుంటుంది.

7. తులా రాశి

చాలా కాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఈరోజు మీరు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. సమయాన్ని వృధా చేయకుండా శ్రమించి పనిచేస్తారు. మీ జీవిత భాగస్వామిని బయటకు వెళ్లాలనుకునేటప్పుడు వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి. వస్త్రధారణ వలన మీ భాగస్వామితో మనస్ఫర్థలు వస్తాయి.

8. వృశ్చిక రాశి

ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కోసం ధనాన్ని ఖర్చుపెడతారు. ఎప్పటి నుంచో పొదుపు చేస్తున ధనము ఈరోజు మీచేతికి వస్తుంది. మీరు ప్రేమించినవారితో వివాదాలకు దారితీసి వారిని అప్ సెట్ చేయగల విషయాలను దాటవెయ్యడం ఉత్తమం. డబ్బును వృథా చెయ్యకండి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

9. ధనస్సు రాశి

అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్నప్పుడు మీ శక్తిని తిరిగి పొండడానికి పూర్తి విశ్రాంతిని తీసుకుంటారు. అవసరమైన ధనం లేకపోవటం వల్ల కుటుంబలో అసమ్మతికి కారణమవుతుంది. ఏదైనా పని చేసే ముందు కుటుంబ సభ్యలతో మాట్లాడి వారియొక్క సలహాలను తీసుకోండి. పిల్లలు వారి చదువుపైన, భవిష్యత్తు పైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఎప్పుడు పని మీదే ధ్యాస పెట్టకండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీద మీకు బాగా కోపం వస్తుంది.

10. మకర రాశి

దగ్గరి బంధువుల ఇంటికి వెళ్ళటం వలన మీకు ఆర్ధికసమస్యలు మెరుగుపడతాయి. మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరి నుంచి సరైన సమాచారం అందక, నిరాశకు లోనవుతారు. మీ జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగుతుంది. మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వైహహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

11. కుంభ రాశి

మీకు తెలియని వారి నుండి ధనాన్ని పొందుతారు. దీని వలన మీ యొక్క ఆర్ధిక సమస్యలు తీరతాయి. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించడం వల్ల ఈరోజు మీకు రోజంతా ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. ఈ రోజు మీకు ఉద్యోగంలో మంచి ప్రశంసలు లభిస్తాయి.

12. మీన రాశి

ఈ రోజు మీ ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. మీ అభిప్రాయాలను పిల్లలపై రుద్దకండి. పిల్లల పట్ల గట్టిగా అరవకుండా ప్రేమగా మెలగడం వల్ల వారు మీరు చెప్పేవి వింటారు. మీ వైహహిక జీవితం సరదాగా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. పిల్లల చదువుల పట్ల జాగ్రత్త వహించాలి.

ఇదీ చదవండి: తిరుమలేశుడికి ప్రకృతి సొబగులు

Exit mobile version