Site icon Prime9

Horoscope: నేటి రాశి ఫలాలు (10 నవంబర్ 2022)

daily horoscope details

daily horoscope details

Horoscope: ఈ రోజు అన్నిరాశుల వారికి చాలా సంతోషకమైన రోజుగా ఉంటుంది. చాలా మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు కానీ వాటిని ఎలా పరిష్కరించాలా అని ఆలోచించి తగిన నిర్ణయంతో వాటిని అధిగమిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.

1.మేష రాశి
మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మీకు వత్తిడిని, ఆతృతలు కలిగిస్తుంది. మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదురుకుంటారు. మీ స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు అండగా నిలబడతారు. ఈ రోజు ఎక్కువగా మీరు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండి గుళ్లను సందర్శిస్తారు.
ఈ రోజు మీ ఆరోగ్యం బాగానే బాగుంటుంది.

2.వృషభ రాశి
నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలని తెస్తుంది. అనవసరమైన టెన్షన్లు మీ సంతోష జీవితాన్ని పాడుచేస్తాయి. పాట్నర్ గా మీరు చేస్తున్న వ్యాపారాలు మీకు నష్టాన్ని మిగిల్చే సూచన ఉంది. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

3. మిథున రాశి
ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరంగా మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆరోగ్య పరంగా చాలా బాగుంటారు. మీకుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి, మీ క్షణికావేశాన్ని అదుపులో ఉంచుకొండి. మీ జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా గడుపుతారు.

4. కర్కాటక రాశి
మీ ఛార్మింగ్ ప్రవర్తన మీ చుట్టూ ఉన్న అందరినీ ఆకర్షిస్తుంది. ఈరోజు మీదగ్గర చెప్పుకోదగినంత ధనాన్ని కలిగి ఉంటారు. దీని వలన మీరు మానసికశాంతిని పొందుతారు. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించడం వల్ల మీకు ఈ రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ మనసును వేధిస్తున్న సమస్యలను ఈ రోజు పరిష్కరించగలరు.
వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు.

5. సింహ రాశి
ఎవరైతే ధనాన్ని, జూదంలోనూ, బెట్టింగ్లోను పెడతారో వారు ఈరోజు నష్టపోకతప్పదు. ఈ రోజు మీరు ఇతరులను కలవడానికి ఇష్టపడరు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్యంగా ఉంటారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

6. కన్యా రాశి
మీకున్న చెడు అలవాట్లు మిమ్మల్ని అగాధంలోకి నెట్టివేస్తాయి. దీర్ఘకాలిక అవసరాల కోసం మదుపు చెయ్యడం అవసరం. ఈ రోజు మీరు పెద్ద పార్టీని ఇస్తారు. ధ్యానం మరియు యోగా మీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు ఈ రోజు ధనలాభాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

7. తులా రాశి
మీ ప్రేమ తిరస్కరించబడుతుంది. మీరు ఈరోజు అధికమొత్తంలో పార్టీల కోసం డబ్బును ఖర్చుచేస్తారు. అయినప్పటికీ మీకు ఆర్ధికంగా ఎటువంటి ఢోకా ఉండదు. కుటుంబంతోను, స్నేహితులతోను సంతోషంగా ఉంటారు. మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. మీ వృత్తి వ్యాపారాల్లో తగిన లాభాలు లభిస్తాయి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.

8. వృశ్చిక రాశి
మీరు గతంలోని సంఘటనలను తల్చుకుంటూ ఉంటే మీ నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం చేయవచ్చును. వీలైనంతగా రిలాక్స్ అవండి. దీర్ఘ కాలిక పెట్టుబడులను తప్పించుకొండి. మిత్రులతో గడిపే సాయంత్రాలు మీకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మీ దయా స్వభావం ఈ రోజు మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆఫీసులో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. మీ బెటర్ హాఫ్ తో ఆనందంగా ఉంటారు.

9. ధనస్సు రాశి
ఈరోజు మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. హెల్త్ పట్ల జాగ్రత్త అవసరం. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలని తెస్తుంది. మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మీ ఖాళీ సమయాన్ని కుటుంబంలో ఆనందంగా గడపండి. మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడుస్తుంది.

10. మకర రాశి
ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. నిజమైన ప్రేమ యొక్క అనుభూతిని చెందుతారు. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడుస్తుంది.

11. కుంభ రాశి
ఆరోగ్యం బాగుంటుంది. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలనే కోరిక కలుగుతుంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ మీస్నేహితులుగా ఉండడానికి కోరుకుంటారు. దానిని మీరు స్వాగతిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఈ రోజు మీకు ఆర్ధిక సమస్యల నుండి ఉపశమనము కలిగుతుంది. మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

12. మీన రాశి
వయసు మీరిన వారు తమ ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించాలి. మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదురుకుంటారు. ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.

ఇదీ చదవండి: శ్రీవారి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం

Exit mobile version