Site icon Prime9

Pitru Paksham: పితృ దోషం ఉన్న వారు చేయాలిసిన పరిహారాలు ఇవే !

pitru Paksha prime9news

pitru Paksha prime9news

Pitru Paksham: పితృ పక్షంలో చనిపోయిన వారిని తలచుకుంటూ, వారి ఆత్మకు శాంతి కలగాలని పిండ ప్రదానం చేస్తారు.ఈ పిండ ప్రధానం చేసే వారు దానం, శ్రాద్ధం వంటి కార్యక్రమాలు కూడా చేస్తే మంచిదట.. ఇలా చేయడం వాళ్ళ చనిపోయిన వారు సంతోషించడమే కాకుండా వారికి ఏం కోరుకున్నా అవి నెరవేరతాయి. పితృ పక్ష కార్యక్రమం చేసే వాళ్ళ ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం, కొత్త వస్తువులు కొనడం, శుభకార్యాలు ఏవి చేసుకోకూడదు.ఈ పితృ పక్షం ఈ నెల 10 నుంచి మొదలయి 25 వరకు ఉంటుంది, అంటే మొత్తం ఇది 15 రోజులు ఉంటుంది.మీ జాతకంలో పితృ దోషం ఉంటే దాని నివారణకు ఈ పితృ పక్ష కార్యక్రమం చేయడం వల్ల పితృ దోషం నుండి విముక్తి కలుగుతుంది.

ఈ పరిహారాలు తప్పనిసరిగా చేయాలి

కటిక అమావాస్య రోజున నల్ల నువ్వులు, తెల్లటి చందనం, తెల్లటి పువ్వులు నీళ్లలో వేసి రావి చెట్టుకు పోసి,ఆ తరువాత చెట్టు దగ్గర దీపాన్ని వెలిగిస్తూ, ‘ఓం సర్వ పితృ దేవాయ నమః’ అనే మంత్రాన్ని జపించండి.ఇలా చేయడం వల్ల పితృ దోషం నుండి విముక్తి కలుగుతుంది.పితృ దోషం ఉన్నవారు ఇంటి గోడపై చనిపోయిన వారి ఫోటోకు పూల దండ వేయండి, అంతే కాకుండా వారు చనిపోయిన రోజు,నిరుపేదలకు ఆహారం ఇవ్వండి..ఇలా చేయడం వాళ్ళ మీకు మంచి జరుగుతుంది.

Exit mobile version