Site icon Prime9

Horoscope Today : రాశి ఫలాలు ( బుధవారం  నవంబర్  2, 2022 )

daily horoscope details

daily horoscope details

Horoscope Today : రాశి ఫలాలు ( బుధవారం  నవంబర్  2, 2022 )

1.మేష రాశి

మీరు కోరుకున్నవాటిని సాధించడం కోసం మీ వ్యక్తిగత సంబంధాలను  వాడడం వలన  మీ సతికి   కోపం రావచ్చు.  పెండింగ్ విషయాలు వల్ల మీ మనసుకు బాధ కలుగుతుంది .ఈ రోజు మీ ఇంటికి అనుకోని విధంగా    కానుకలు, బహుమతులు మీ  స్నేహితుల నుంచి  అందుతాయి.ఎవరిని నమ్మి మీ  ఆలోచనలను ఎవరికి చెప్పకండి.  మీరు ఈ రోజు మీకు నచ్చిన పనులను చేయాలనుకుంటారు కానీ కొన్ని కారణాల వల్ల చేయలేరు.

2.వృషభ రాశి

ఈ రోజు  మీరు  చాలా  ప్రశాంతంగా ఉంటారు.ఈ రాశికి చెందిన వారికి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి.  లభిస్తాయి  ఆర్థికస్థితిలు మెరుగుపడతాయి. మీరు ప్రేమించినవారితో  ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. వారితో మాట్లాడేటప్పుడు    జాగ్రతగా ఉండండి. ఈ రోజు ఓటమి ఈరోజు మీ వెనుకనే ఉంటుంది కానీ కొంచం కష్టపడితే పెద్ద విజయాన్ని సాధిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే  బాధపెడతారు.

3. మిథున రాశి

ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మీరు ఈ రోజు ఈ పని చేసిన ఒత్తిడికి గురికాకండి. మీకు ఈ  రోజు నిరాశ  మిగలనుంది. అందరూ మిమ్మలని  అర్థం చేసుకుంటారని ఆశిస్తారు కానీ అది మిమ్మలని ఇంకా బాధ పెట్టేలా చేస్తుంది. ఈ రోజు మీకు నిజమైన ప్రేమ దొరకనందు వలన మీరు అప్ సెట్ అవుతారు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది.

4. కర్కాటక రాశి

మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యము కొరకు కొంత డబ్బును  ఖర్చు  చేయాలిసి ఉంటుంది.అయినప్పటికీ మీరు బాధ పడలిసిన అవసరం లేదు.మీరు ఎప్పటి నుంచో పొదుపు చేస్తున్న డబ్బు మీ దగ్గరకు వస్తుంది. మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్ని అన్ని గుర్తు చేసుకుంటారు.

5. సింహ రాశి

మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోండి. ఎవరి  సహాయం తీసుకోకుండా మీరు డబ్బును సంపాదించగలరు. ఎవరి మీద ధ్యాస పెట్టకుండా మీ మీద ధ్యాస పెట్టండి.ఎవరికోసమో బ్రతకకండి.. మీ కోసం మీరు బ్రతకడం నేర్చుకోండి. ఈ రోజు  మీ ప్రియురాలిని హర్ట్ చేస్తారు. మీ వివాహ బంధంలో మూడో మనిషి రావడం  ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవలు జరగవచ్చు.

6. కన్యా రాశి

మీ వలన బాధ పడిన వారికి  మీరు  క్షమాపణ చెప్పాలి. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారని మీరు ఈ రోజు తెలుసుకుంటారు.   మీరు మీ యొక్క చదువుల కోసమో  లేక ఉద్యోగం  కోసమో  ఇంటికి దూరంగా ఉన్నట్టు ఐతే   మీ యొక్క ఖాళి సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో కేటాయిస్తారు.చాలాకాలం తర్వాత  మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

7. తులా రాశి

ఈ రోజు మీరు పని చేసే  ఆఫీసులో మిమ్మలని   మెచ్చుకుంటారు. మీ పనిపట్ల ఆనందాన్నివ్యక్తం చేస్తారు.పెట్టుబడులు పెట్టెవారికి ఇది మంచి సమయం. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఈ రాశికి చెందిన వారు ఈ రోజు వారి సమయాన్ని వృధా చేస్తారు.ఈ రోజు  బాగా  ఎంజాయ్ చేస్తారు.మీ వైవాహిక జీవితం మారుతుంది.

8. వృశ్చిక రాశి

పని ఒత్తిడిని తగ్గించడానికి యోగా,వ్యాయామం చేయాలిసి ఉంటుంది.ఏది ఐన పని చేసే ముందు మీ కుటుంబ సభ్యులతో చర్చించండి.ఆఫీసులో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది.మీ జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.మీ వైవాహిక జీవితం మీకు నచ్చిన విధంగా ఉండదు.

9. ధనస్సు రాశి

ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం చేయాలిసి ఉంటుంది  .డబ్బులు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయకండి.మీ ప్రేమ ప్రయాణంలో కొత్త చిక్కులు వస్తాయి.ఇతరుల విషయాలను పట్టించుకోకండి..ఇది మీకు రోజుమొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీరు ఎక్కువ ఖర్చు  పెట్టడం వలన  మీ జీవిత భాగస్వామికి , మీకు గొడవలు జరగవచ్చు.

10. మకర రాశి

మీరు పని చేసే దగ్గర గుర్తింపు రావాలంటే మీరు ఇంకా కష్ట పడలిసి ఉంది.మీ స్నేహం ప్రేమగా మారిపోయే అవకాశం ఉంది.మీ ఖాళీ సమయాన్ని మీకు నచ్చిన పనులు చేయడానికి ఉపయోగించుకుంటారు.ఈ రోజు   సాయంత్రము  సంతోషంగా,ఆనందంగా ఉండటానికి మీకు నచ్చిన పనిని  ఏదో ఒకటి  చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు కోపం తెప్పించవచ్చు.

11. కుంభ రాశి

మీకు కష్టపడితేనే మీకు మంచి ఫలితం  ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు  ఈ రోజు టీవీచూడటం , సినిమా చూడటంద్వారా వారి సమయాన్ని చేస్తారు.దీని వలన మీరు వారు చేయాలనుకున్న పనిని పూర్తిచేయలేరు. మీ బంధువులు మీ ఇంటికి రావడం వలన  ఈ రోజు మీరు చేయలునుకున్న పనిని చేయలేరు.

12. మీన రాశి

ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది.మీరు చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు.ఈ రోజు మీ  మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నపుడు ఎవరు మీకు సహయం చేయరు.  తన జీవితంలో మీ విలువను గొప్పగా చెప్పడం ద్వారా  మీ భాగస్వామి ఈ రోజు సంతోషంగా ఉంటారు.

 

Exit mobile version