Site icon Prime9

Horoscope Today: రాశి ఫలాలు (బుధవారం  19 ,2022)

daily horoscope details

daily horoscope details

Horoscope Today: రాశి ఫలాలు (బుధవారం  19 ,2022)

1. మేష రాశి

మీ అద్భుతమైన శ్రమ, సమాయానికి మీ కుటుంబ సభ్యుల నుంచి  సహకారం తీసుకోవడం  వలన మీరు  కోరుకున్న ఫలితాలను మీరు పొందగలరు.  కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం చాలా  శ్రమ  పడాలిసి  ఉంటుంది. మీకు ఎంత పని వత్తిడి ఉన్న మీరు మాత్రం ఉత్సాహంగా ఉంటారు.మీరు ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి.ఈరోజు,మీరు మీ  ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు.మీ భావాలను వారితో పంచుకొని వారితో సంతోషంగా ఉంటారు.  ఈ రోజు మీ భాగస్వామి ప్రేమలో పడి  అన్ని సమస్యలను  మీరు మర్చిపోతారు.

2. వృషభ రాశి

మీకు నచ్చినట్లుగా మీ పిల్లలు ప్రవర్తించరు.మీకు బాగా  చీకాకు, కోపం  తెప్పిస్తారు.అందరిమీద అతి  ప్రేమ చూపించకండి. అలాగే  కోపం తగ్గించుకోండి.  ప్రతిఒక్కరిపైనా కోపం చూపించకండి. అందులోనూ కోప్పడిన వ్యక్తికి మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుంది, కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఈ రోజు మీ ప్రియమైన వారి వల్ల  మీరు భాదను పొందుతారు.మీకు ఈ  రోజు అంత బాగుండదు. అనేక విషయాల పట్ల వివాదాలు, అనంగీకారాలు ఉండవచ్చును. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కొంచం జాగ్రత్తగా ఉండండి.

3. మిథున రాశి

పనిలో పని పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది.ఈ రోజు మీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు.మీ అవసరం ఉన్న వారికి మీ సహాయాన్ని అందించండి.మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయాలిసి ఉంటుంది.సరైన నిర్ణయాలు తీసుకోండి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

4. కర్కాటక రాశి

చెడు అలవాట్లకు దూరంగా ఉండండి.మీ వస్తువులను ఈ రోజు జాగ్రతగా పెట్టుకోండి లేకపోతే దొంగిలించే అవకాశం ఉంది.మీ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.మీరు మీ సమయాన్ని మీ భాగస్వామితో గడుపుతారు.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీకు బాగా కలిసి రానుంది.మీకు,మీ జీవిత భాగస్వామికి మధ్య గొడవలు జరగవచ్చు.

5. సింహ రాశి

కోపాన్ని తగ్గించుకోవాలి లేదంటే చాలా కోల్పోవాలిసి ఉంటుంది.ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది.ఈ రోజు తీరిక లేకుండా పని చేస్తూనే ఉంటారు.ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు.ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా మీకు కనిపిస్తాయి.  ఈ రోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని బాగా అవహించనుంద అన్న మాట.

6. కన్యా రాశి

ఈ రోజు మీరు విలువైన వస్తువును పోగొట్టుకుంటారు. క్రొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. అయినాకానీ మీ వ్యక్తిగతం మరియు విశ్వసనీయతా వివరాలను ఎవరికి చెప్పవద్దు. కానీ మీరు ఏ విషయంలో  కూడా  తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి,అది  తెలివైన పని కాదు. మీకు ఈ  రోజు బాగా ఉత్తమమైనదిగా అవుతుంది.   మీ జీవిత భాగస్వామి ఈ రోజు  మంచి మూడ్ లో మీకు కనిపిస్తారు.

7. తులా రాశి

ఆరోగ్యపరంగా ఈ రోజు మీకు  రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసికస్థితి మీకు కావలిసిన శక్తిని ఇచ్చి  ఆత్మ విశ్వాసంతో ఉందేలాగ చేస్తుంది. మీ సృజనాత్మకత నైపుణ్యాలు,సరియైన విధంగా మీరు  ఉంచగలిగితే, ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడి నిస్తాయి.మీకు ఖాళీ సమయము దొరికినప్పటికీ మీరు మీ కొరకు ఉపయోగించుకోకుండా మీ సమయాన్ని వృధా చేస్తారు. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని అర్ధం చేసుకుటుంది.

8. వృశ్చిక రాశి

ఇతరులకి వారి ఆర్ధికవసరాలకు వారికి  అప్పు ఎవ్వరు  ఇవ్వకపోయినప్పటికీ  మీరు వారి అవసరాలకు కొంత  ధనాన్ని అప్పుగా ఇస్తారు. మీరు రోజు  కలిసే వ్యక్తుల నుంచి  సమాచారం అందుతుంది. మీకు మీ ప్రియురాలికి మధ్య పెద్ద గొడవలు జరుగుతాయి. మీ వైవాహిక జీవితం అలాగా సాగిపోతుంది. ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామి కొత్తగా కనిపిస్తుంది.

9. ధనస్సు రాశి

చెడు అలవాట్లను తొందరగా మానుకోవాలి లేదంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.ఖర్చులు ఎక్కువవుతాయి.మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి.పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.ఈ రోజు మీకు బాగా కలిసి రానుంది.మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు రాబోతున్నారు,వారి రాక మీ జీవితంలో కొత్త మార్పులను తేనున్నాయి.ఈ రోజు మీ బాధలను మీ స్నేహితుడుతో పంచుకుంటారు.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

10. మకర రాశి

మీరు ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలాకాలంగా ఎదురుచూస్తూ ఉంటే , ఆ మంచి రోజు ఈ రోజే అని తెలుసుకోండి.  ఈ రాశికి చెందిన వారు ఈ రోజు  ఒంటరిగా ఉండేందుకే ఎక్కువ ఇష్టపడతారు.ఈ  రోజు మీరు ఖాళి సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోడానికి కేటాయిస్తారు. ఏదో పాత విషయం  గుర్తు తెచ్చుకొని   మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు.

11. కుంభ రాశి

బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు దొరకడమే కాకుండా  పెద్ద ప్రోత్సాహం కూడా దొరుకుతుంది. ఈ రోజు మీ సంతానము నుండి మంచి  ఆర్ధికప్రయోజనాలను పొందగలరు.ఈ రోజు ఈ రాశికి చెందిన వారు సంతోషంగా ఉంటారు. ఇల్లుమారడం ఎంతో శుభకరం కాగలదు. మీకు, మీ ప్రియమైన వారికి మధ్యన మూడవ మనిషి రావడం వలన మీరు మరింత దూరమయ్యే  ప్రమాదం ఉంది.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

12. మీన రాశి

ఈ రోజు  ఆర్థికసంబంధ సమస్యలు తొలగిపోతాయి,మీరు ఆర్థికప్రయోజనాలను పొందగలరు. మీ కరకు ప్రవర్తన వాళ్ళ మీ  పిల్లలకు మీ మీద కోపం వస్తుంది.ఈ రోజు   మీ ప్రియురాలి వల్ల మీరు   నిరాశ ఎదురవుతుంది. మీరు ప్రతి విషయాన్ని భూత అద్దంలో పెట్టి చూడకండి.  లేకపోతే తరువాత విచారించవలసి వస్తుంది.ఆఫీసులో మీరు చేసే పనికి మీకు మంచి పేరు  వస్తుంది . మీకు, మీ జీవిత  భాగస్వామికి మధ్య  విభేదాలు తెచ్చిపెట్టేందుకు వేరే వాళ్ళు బాగా  ప్రయత్నిస్తారు.  కానీ మీరిద్దరూ  సర్దుబాటు చేసుకుంటారు.

 

Exit mobile version