Horoscope Today: రాశి ఫలాలు (మంగళవారం 18 ,2022)
1. మేష రాశి
అనారోగ్యంగా ఉన్నారని బాధ పడకండి.ఆఫీసులో ఈ రోజు చాలా ఆనందంగా ఉంటారు.ఈ రోజు మీరు బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు ప్రయాణం చేయాలిసి వస్తే మీతో ముఖ్యమైన పత్రాలనన్నిటినీ తీసుకొని వెళ్ళండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు చేస్తారు. కానీ అలా చేయడం వలన మీరు అద్భుతమైన సమయాన్ని మీ భాగస్వామితో కలిసి గడుపుతారు.
2.వృషభ రాశి
ఎప్పుడు విచారంగా ఉండకండి. అది మిమ్మల్ని ఆవరించి, మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది .మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి,అలా చేయకపోతే మీయొక్క ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది . ఇది మీ ఆర్ధికస్థితి పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజు మీకు చాలా అనుకూలిస్తుంది. మీకు అందమైన, రొమాంటిక్ రోజుగా మారుతుంది . కానీ ఆరోగ్య సమస్యలు వల్ల ఇబ్బంది పడతారు.
3.మిథున రాశి
ఈ రోజు చేయాలిసిన పనులు కాకుండా అనవసర పనులు చేయడం వల్ల మీ సమయమంత వృధా చేస్తారు. మీరు ఇల్లు మారడం వల్ల మీకు శుభకరం కాగలదు. మాయ ప్రేమ మీ చుట్టూ తిరుగుతుంది. ఆ ప్రేమ మిమల్ని నిరాశకు గురిచేయదు. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి గుర్తింపు వస్తుంది. ఈ రోజు మీకు చాలా హాయిగా గడిచిపోనుంది.మీరు ప్రయాణం చేసే టప్పుడు మీ సామాను జాగ్రత్తగా చూసుకోండి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో గొడవ పడవచ్చు.
4.కర్కాటక రాశి
ఈ రోజు మీరు ఏమి చేయాలనుకుంటారో వాటిని చేయండి. పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి సమయం. ఈ రోజు మీ పాత స్నేహితులను కలుకుసుకుంటారు. మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టము కలసివస్తుంది. మీ బంధువులు, స్నేహితులు మీ ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి.వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేసే ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించనున్నాయి.
5.సింహ రాశి
ఆర్ధిక సమస్యల వల్ల కొత్త ఇబ్బందులు వస్తాయి. మిమ్మల్ని మీరు మార్చుకోవాలిసి ఉంటుంది. మీరు ఎంత బిజీగా మీతో మీరు సమయాన్ని గడపండి.
మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు. మీ జీవిత భాగస్వామి గురించి కొత్త విషయాలను తెలుకుంటారు.
6.కన్యా రాశి
ఆర్ధికంగా మెరుగుపడతారు.ఇది వరకు కంటే ఎక్కువ ధనము ఉంటుంది. ఆఫీసులో మీరు ఇబ్బంది పడుతుంటే ఈ రోజుతో మీ సమస్యలు తొలగినున్నాయి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ముందు చేయాలిసిన పని ఏంటంటే మీ కోపాన్ని తగ్గించుకోవాలి లేదంటే మీరు తీవ్రంగా దెబ్బ తినాలిసి ఉంటుంది. ఖాళీ సమయాన్ని మీ ఇంటి వారికి కేటాయించండి.ఈ రోజు ఏ పని చేయకుండా మీ సమయాన్ని వృధా చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
7.తులా రాశి
బయట ఫుడ్స్ తినడం వలన ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు . ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో రొమాంటిక్ మూడ్ లోకి వెళతారు.
8.వృశ్చిక రాశి
మీరు మంచి పని చేసే ముందు పెద్ద వారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ బంధువులు అనుకోకుండా మీ ఇంటికి వస్తారు. మీ ప్రియమైన వారికి మీ ప్రేమ దొరుకుతుంది. మీకు ఇష్టం లేకపోయినా మీరు బయటికి వెళ్ళాలిసి వస్తుంది. మీ జీవిత భాగస్వామి వల్ల మీకు కోపం వస్తుంది
9.ధనస్సు రాశి
మీరు చేసే ఆఫీసులో ఒత్తిడి, టెన్షన్ కలిగిస్తాయి. మీ పాత స్నేహితులు అప్పు కోసం మీ దగ్గరికి వస్తారు .మీ ప్రవర్తన వలన మీకు కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
10.మకర రాశి
ఈ రోజు మీకు కొత్త వ్యక్తిని కలుసుకోబోతున్నారు.ఒత్తిడిని తట్టుకోవడానికి వ్యాయామం చేయండి.ఈ రోజు మీ ప్రేమ ప్రయాణం మొదలు కానుంది. ఎంత మంది వచ్చినా మీ విజయాన్ని ఆపలేరు. మీరు చేయాలనుకున్న పనిని పూర్తి చేస్తారు. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.మీ ఖాళీ సమయములో ఈ రోజు మీరు మీ ఫోనులో ఏదైనా కొత్త సినిమాను చూడటానికి ఇష్టపడతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
11.కుంభ రాశి
ఒత్తిడిని తట్టుకోవడానికి వ్యాయామం చేయండి. మీరు తినే తిండిని తగ్గించుకోవాలి. మీ బాధను వేరొక స్నేహితునితో పంచుకొని బాధ పడతారు. మీరు ఇంకా కష్టపడలిసి ఉంది. మీ జీవితాన్ని మార్చుకోవాలిసి ఉంటుంది.బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.ఈ రోజు మీ వైహహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
12.మీన రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.మీ నుంచి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో మీరు సరిగ్గా తెలుసుకోండి. ఈ రోజు మీ స్నేహితుల నుంచి మంచి వార్తలు వింటారు. మీ ప్రియమైన వారితో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశికి చెందిన వారికి గ్రహాలు అనుకూలించడంతో ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు కోపం తెప్పిస్తుంది.