Site icon Prime9

Horoscope: ఈ రాశుల వారు ఎవరికీ వాగ్దానాలు చెయ్యకపోవడం ఉత్తమం..

daily horoscope details of different signs on november 9 2023

daily horoscope details of different signs on november 9 2023

Horoscope: ఈ 12 రాశుల వారు అంత త్వరగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం ఉత్తమం, మరి గ్రహచార రీత్యా ఏ రాశి వారికి ఎలా ఉండుందని చెప్పడమే ఈ రాశిఫలాల ముఖ్య ఉద్దేశ్యం.

మేషం:

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది.  ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు.

వృషభం:

వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. సంతానయోగ సూచనలున్నాయి. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యం పర్వాలేదు.

మిథునం:

ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి ఉంటుంది. రుణ సమస్యలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసు ఒకటి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది.

కర్కాటకం:

ఉద్యోగ జీవితం ప్రశాంతంగానే సాగిపోతుంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. పిల్లలు చదువులోనూ, ఉద్యోగ ప్రయత్నాలలోనూ విజయం సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

సింహం:

వృత్తి నిపుణులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొందరు స్నేహితులు అపార్ధాలతో దూరమయ్యే అవకాశం ఉంది. కొంచెం సహనంతో వ్యవహరిస్తే మంచిది. ఆదాయం పెరుగుతుంది. రుణ సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది.

కన్య:

ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. అయితే, ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు.మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు.

తుల:

మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తోంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారంలో ఒక అడుగు ముందుకు వెళతారు. కుటుంబంలో కొద్దిగా చికాకులు, అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. హామీలు ఉండవద్దు.

వృశ్చికం:

ఆర్థికపరంగా ఇంటి పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. హితుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు.

ధనుస్సు:

ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వేరే ఉద్యోగానికి మారాలన్న నిర్ణయాన్ని మార్చుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది.  వ్యాపారులు లాభాల పంట పండిస్తారు. ఐటీ నిపుణులకు ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది.

మకరం:

వ్యాపారంలో లాభాల పరిస్థితి ఆశించిన స్థాయిలోనే ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని విధంగా సహచరుల నుంచి ఒకటి రెండు సమస్యలు ఎదురవుతాయి. వ్యవహార శైలిని మార్చుకోవడం మంచిది. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగే సూచనలు ఉన్నాయి.

కుంభం:

ఆర్థిక పరిస్థితి చాలావరకు సానుకూలపడు తుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు శ్రేయస్కరం కాదు. వ్యాపారంలోనూ, వృత్తులలోనూ మంచి పురోగతి కనిపిస్తుంది. మీ కొత్త ఆలోచనలకు చక్కని ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు చదువుల్లో దూసుకుపోతారు. ఆహార విహారాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

మీనం:

అటు ఉద్యోగంలోనూ, ఇటు కుటుంబంలోనూ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వ్యాపారంలో మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి.

Exit mobile version