Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుందని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 26 న రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
మేషం..
వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో శుభ కార్యంలో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృషభం..
శత్రు సంబంధమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం..
వృత్తి, వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు తప్ప కుండా సానుకూల ఫలితాలను ఇస్తాయి. కొందరు మిత్రుల వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి.
కర్కాటకం..
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో సామరస్యం నెలకొంటుంది. కుటుంబంలో అన్యోన్య వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం చాలా మంచిది.
సింహం..
కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు, ఆలోచనలకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు వీటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొత్త పరిచయాల వల్ల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. బంధువులు, స్నేహితులకు ఆర్థికంగా సహాయపడతారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది.
కన్య..
ఉద్యోగాలలో అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. నిరుద్యోగు లకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు నిరాశపరిచే సూచనలున్నాయి. సొంత వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు.
తుల..
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. కొందరు బంధువులు ముఖ్యమైన వ్యవహారాలలో సహాయపడతారు. స్నేహితుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మరింతగా పురోగతి సాధిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలున్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు.
వృశ్చికం..
ఇతరుల వ్యవహారాలకు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. అనవసర ఖర్చులను తగ్గిస్తే మంచిది. ఆహార, విహారాల్లోనే కాక, ప్రయాణాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొందరు బంధువులతో కాలక్షేపం చేస్తారు.
ధనస్సు..
వృత్తి, ఉద్యోగాలలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. శుభ కార్యం తలపెడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విదేశాల నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది.
మకరం..
ఆదాయాన్ని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అవసరమైతే ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
కుంభం..
ఉద్యోగ, ఆర్థిక స్థిరత్వాలు లభించే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కొద్దిగా ప్రతికూల తలు కనిపిస్తాయి. సాధారణ వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగు లకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది.
మీనం..
వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులలో ఒకరికి స్వల్ప అనారోగ్య సూచనలు న్నాయి. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.