Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుందని తెలుస్తుంది. అదే విధంగా ఆయా రాశుల వారికి ఉద్యోగంలో పురోగతి, ధన లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. జనవరి 19 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
కర్కాటకం..
నేడు ఈ రాశి వారు అనారోగ్యం నుంచి కొంత ఉపశమనం పొందుతారు.
ఆర్థిక సమస్య కూడా పరిష్కారం అవుతుంది. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు.
ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు.
వృషభం..
ఈ రాశి వారు నేడు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మీకు రావలసిన మొండి బాకీలు వసూలయ్యి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యకు కూడా పరిష్కారం లభ్యం అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఐటీ నిపుణులకు గుర్తింపు లభిస్తుంది. ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి.
మేషం..
ఈ రాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి.
ఉద్యోగంలో మరింత ఉన్నత స్థాయికి కూడా చేరుకునే అవకాశం కనిపిస్తుంది.
అనారోగ్య సమస్య కూడా కొద్దిగా పరిష్కారం అవుతుంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది.
కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విద్యార్థులకు విజయాలు లభిస్తాయి.
తుల..
వీరికి తల్లిదండ్రుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.
దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఇల్లు గానీ, స్థలం కానీ కొనే ఆలోచన చేస్తారు.
వృత్తి వ్యాపారాలలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృశ్చికం..
ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.
అనవసర ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. వృత్తి వ్యాపారాలలో లాభాలు గడించే అవకాశం ఉంది.
ఉద్యోగంలో అదనపు బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. (Daily Horoscope)
మిథునం..
వీరికి విదేశీ కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి సాధించవచ్చు.
ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
కొద్దిపాటి అనారోగ్యం సంభవించే సూచనలు ఉన్నాయి. ఆహారం విషయంలో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది.
మీనం..
వీరికి అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు మెరుగుపడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
(Daily Horoscope) ఈ రాశుల వారికి వ్యాపారంలో లాభాలు..
సింహం..
ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది.
ముఖ్యమైన పనుల్లో కష్టపడితే పూర్తి చేసే అవకాశం ఉంది.
గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ఇప్పుడు ముఖం చాటేస్తారు. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడకుండా జాగ్రత్త పాటించాలి.
కన్య..
ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా ఆశించిన మేర పురోగతి ఉంటుంది.
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు నిలకడగానే ఉంటుంది.
ధనుస్సు ..
ఆరోగ్యానికి సంబంధించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది.
భాగస్వాములతో విభేదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.
మకరం..
ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.
వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఐటీ, రాజకీయ రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది.
కుంభం..
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పాటించాలి. వ్యాపారంలో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృత్తి నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య మరింత ప్రేమ పెరుగుతుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/