Breaking News

భారత్ లో రెండో రోజు అదే జోరు లో ఉన్న కరోనా..!

15 th Jun 2020, UTC
భారత్ లో రెండో రోజు అదే జోరు లో ఉన్న కరోనా..!
భారత్ లో కరోనా మహమ్మారి కేసుల జోరు పెరుగుతూనే ఉంది. గత వారమంతా పదివేల కేసులు నమోదు అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఏకంగా పన్నెండు వేలకు పై గా కేసులు నమోదు అయ్యాయి.. వరసగా.. రెండో రోజు.. నేడు కూడా పన్నెండువేల సంఖ్యకు కరోనా చేరువైంది. నిన్నటి కంటే తక్కువే అయినా... నేడు కూడా కరోనా కేసుల సంఖ్యా ఎక్కువ గా ఉంది. 
 
           కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 325 మరణాలు సంభవించగా.. కొత్తగా 11,502 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.ప్రస్తుతం భారత్ లో కరోనా మహమ్మారి కేసుల సంఖ్యా 332424 కి చేరుకుంది. ప్రస్తుతం.. 153106 కేసులు ఆక్టివ్ లో ఉన్నాయి. 169798 మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9520 కి చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
            ప్రస్తుతం ఐదవ విడత లాక్ డౌన్ అన్ లాక్ ఫేజ్ వన్ దశ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. చాలా ఆంక్షలకు సడలింపులు ఇవ్వడం తో.. భారత్ లో తిరిగి సాధారణ జీవనం ఇపుడిపుడే మొదలవుతోంది. ఈ నేపధ్యం లో కేసుల సంఖ్యా పెరుగుతూ వస్తోంది. మరో వైపు పూర్తి గా కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్యా ఎక్కువ గానే ఉంది. ఆక్టివ్ గా ఉన్న కేసుల కంటే.. కోలుకుని ఇంటికి వెళ్లిపోయిన వారే ఎక్కువ గా ఉన్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox