Site icon Prime9

Chandra Grahan 2022 : ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఎప్పుడంటే !

chandra grahan 2022 prime9news

chandra grahan 2022 prime9news

Chandra Grahan 2022 :  జ్యోతిష్య  ప్రకారం గ్రహణానికి  చాలా  ప్రాధాన్యత ఉంటుంది. గ్రహణం విషయంలో హిందూమతంలో చాలా నియమాలు ఉంటాయి. శాస్త్రాల ప్రకారం  చూసుకుంటే  ఇదొక అశుభ ఘటన. పూజా  కార్యక్రమాలు, శుభ కార్యాలు ఈ సమయంలో జరపరు. ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం గురించి ఇక్కడ  పరిశీలిద్దాం..

ఈ ఏడాది అంటే 2022లో  మొత్తం 4 గ్రహణాలు ఉన్నాయి. వాటిలో  రెండు గ్రహణాలు  పూర్తయ్యాయి. మరో రెండు గ్రహణాలు ఉన్నాయి. సూర్య గ్రహణానికి సరిగ్గా 15 రోజుల తరువాత చంద్ర గ్రహణం ఉంటుంది. ఈసారి సూర్య గ్రహణం సరిగ్గా దీపావళి పండుగ నాడు రాబోతుంది. దీపావళికి 15 రోజుల తరువాత చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.  ఈ ఏడాది చివరి సూర్య, చంద్ర గ్రహణాలివే.

ఈసారి దీపావళి అక్టోబర్ 25వ తేదీన రానుంది . సరిగ్గా 15 రోజుల తరువాత  దీపావళి రోజున అంటే నవంబర్ 8వ తేదీన చంద్ర గ్రహణం రానుంది . సూర్య గ్రహణం ఎప్పుడూ అమావాస్య రోజు  , చంద్ర గ్రహణం ఎప్పుడూ  పున్నమి రోజున   వస్తుంటాయి.

చంద్ర గ్రహణం సమయం

2022లో రెండవ, చివరి చంద్ర గ్రహణం ఇండియాలో  కన్పించనుందని తెలిసిన సమాచారం . ఆ సమయం నవంబర్ 8 మద్యాహ్నం 1 గంట 32 నిముషాల నుంచి  సాయంత్రం 7 గంటల 27 నిమిషాల వరకు  ఉంటుంది.

Exit mobile version
Skip to toolbar