Site icon Prime9

Budha Dosham: బుధ దోషం పోవాలంటే ఈ పరిహారం చేయాలిసిందే!

Budda prime9news

Budda prime9news

Budha Graha Dosham: అందం, తెలివితేటలు, కమ్యూనికేషన్ మరియు ఏకాగ్రతకు కారుకుడు బుధుడు. ఎవరి జాతకంలో బుధుడు  మంచిగా ఉంటాడో, ఆ వ్యక్తికి అన్ని విజయాలే లభిస్తాయి. ఏ వ్యక్తి  కుండలిలో బుధుడు బలహీనంగా ఉంటాడో ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కొంటాడు. ఈ వ్యక్తికి అదృష్టం కలిసి రాదు అలాగే ఆర్థికంగా కష్టాలు వెంటాడుతాయి. ఏ పని చేసినా అడ్డంకులు ఎదురవుతాయి. జాతకంలో బుధుడు బలపడాలన్నా, బుధ దోషం తొలగిపోవాలన్నా ప్రతి బుధవారం రోజు ఈ పరిహారాలు ఖచ్చితంగా చేయండి.

జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే ఈ పరిహారం చేయండి ..
1. ఏ వ్యక్తి  యొక్క జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటాడో ఆ వ్యక్తి  అప్పులపాలు అవుతాడు.దీనితో పాటు అతడు డబ్బు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
2. ఎవరి కుండలిలో ఐతే బుధుడు బలహీన స్థితిలో ఉంటాడో ఆ వ్యక్తి  కీర్తి  ప్రతిష్టలను కోల్పోతాడు.
3. ఎవరి  జాతకంలో ఐతే బుధ దోషం ఉంటుందో వ్యాపారం, ఉద్యోగాలలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జాతకంలో బుధుడు  బలపడాలంటే  ఈ  పరిహారం చేయండి..
1. మీ జాతకంలో బుధ గ్రహం బలహీన స్థితిలో ఉంటే బుధవారం రోజు  ఉపవాసం ఉండి, తులసి ఆకులతో గంగాజలం తీసుకోండి. బుధవారం  రోజున రాగి పాత్రలు, ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులను దానం చేస్తే చాలా మంచిది.
2. రత్న శాస్త్రం ప్రకారం, మీ చేతి వేలికి పచ్చని రాయి ఉంగరం ధరించడం వల్ల మీ జాతకంలో బుధుడు బలపడతాడు.

Exit mobile version