Breaking News

అయోధ్య రామ మందిర నిర్మాణం వాయిదా..!

19 th Jun 2020, UTC
అయోధ్య రామ మందిర నిర్మాణం వాయిదా..!
గత ఏడాది నవంబర్ నెలలో అయోధ్య లో రాముడు కి గుడి కట్టించాల్సింది గా భారత ఉన్న త ధర్మాసనం సుప్రీమ్ కోర్ట్ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రధాని మోడీ ఆధ్వర్యం లో రామ మందిరం కోసం ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేసారు. ఈ ట్రస్ట్ అద్వర్యం లోనే రామ మందిర నిర్మాణం ప్రారంభము అయింది. జూన్ పదవ తేదీన.. శివుడు కి పూజలు చేసి.. అయోధ్య లో రామ మందిర నిర్మాణనికి పునాది రాళ్ళూ వేసిన సంగతి తెలిసిందే.  అయితే.. ఈ గుడి నిర్మాణం తిరిగి తాత్కాలికం గా వాయిదా పడింది.
 
        గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా చేపట్టిన దుశ్చర్య కారణం గా ఇరవై మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. వారి వీర మరణం భారత్ లో అనేకమంది ప్రజల ఆగ్రహావేశాలకు కారణమైంది. డ్రాగన్ చేసిన ఈ పనికి భారత్ లో పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమరులైన సైనికుల త్యాగాన్ని కీర్తిస్తూ దేశ ప్రజలు వారికి నివాళులు అర్పిస్తున్నారు. మరో వైపు.. హిందూ మహాసభ, విశ్వ హిందూ పరిషత్‌ వంటి హిందూ సంస్థ లు కూడా చైనా చేసిన నిర్వాకాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్ని చేపట్టాయి.చైనా జెండా, ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ దిష్టి బొమ్మలు, చైనా ఉత్పత్తులను దహనం చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 
 
        ఈ క్రమం లోనే శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఈరోజు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా చేసిన దుశ్చర్య కు నిరసన కు రామ మందిరం నిర్మాణాన్ని తాత్కాలికం గా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి మద్దతుగా నిలబడేందుకు ఈ  నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  ఈ విషయానికి సంబంధించి.. ట్రస్టు సభ్యుడు అనిల్‌ మిశ్రా పీటీఐతో మాట్లాడారు. దేశ పరిస్థితులను అనుసరించి.. నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించే విషయం లో మరో సారి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox