Breaking News

విశాఖ కైలాస గిరి లో అద్భుతాలు సృష్టించనున్న జగన్ సర్కార్..!

23 rd Jun 2020, UTC

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సాగర తీర ప్రాంతం విశాఖ ను అడ్మినిస్ట్రేటివ్ కాపిటల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం జగన్ సర్కార్ విశాఖను స్వర్గధామం గా తీర్చిదిద్దటానికి ప్రయత్నాలు చేస్తోంది. పర్యాటక రంగం లో కైలాసగిరి ని టూరిజం ఐకాన్ గా తీర్చిదిదుతోంది. ఈ క్రమం లో విశాఖ లో ని కైలాసగిరి వద్ద ప్లానిటోరియం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దాదాపు.. రూ.37 కోట్లతో 7 ఎకరాల విస్తీర్ణంలో  ఈ ప్లానిటోరియం ను ఏర్పాటు చేయనుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కైలాసగిరి అభివృద్ధికి పూర్తిస్థాయి ప్రణాళికల్ని వీఎంఆర్‌డీఏ సిద్ధం చేసింది.
 
          సాధారణం గా.. సముద్ర మట్టానికి కైలాసగిరి దాదాపు 110 మీటర్ల ఎత్తులో ఉంది. అక్కడి నుంచి విశాఖ ను చుస్తే ఎంతో అందం గా ఉంటుంది. నింగిని తాకుతున్నట్లు అనిపిస్తుంటుంది. అలాంటి చోట.. 3D టెక్నాలజీ తో నక్షత్రాలను సృష్టించనున్నారు. నింగి ని తాకుతూ.. నక్షత్రాల మధ్య విహరిస్తూ ఉండేలాగా ఈ ప్రదేశాన్ని తీర్చిదిద్దటానికి ప్రణాళిక లు వేస్తున్నారు. హైబ్రిడ్‌ ప్రొజెక్షన్లు, 3డీ డిజిటల్‌ ప్రొజెక్టర్‌తో 200 మంది కూర్చొని వీక్షించేలా ప్లానిటోరియం నిర్మించనున్నారు. ఇక్కడ ప్రదర్శన ప్రారంభం కాగానే.. నక్షత్రాల మధ్య విహరించే అనుభూతిని 3D  టెక్నాలజీ ద్వారా అందించనున్నారు.   
 
         ప్లానిటోరియం మాత్రమే కాకుండా గ్రహాలు, నక్షత్రాలు, సౌరమండలం, ఉపగ్రహాలు.. ఇలా సౌర కుటుంబంలోని ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించేలా చుట్టూ వివరాలు తెలుసుకునేలా చిత్రాలు, వివరాలు ఏర్పాటుచేయాలనీ జగన్ ఆదేశించారు. మంగుళూరులోని పిలుకుల ప్రాంతీయ సైన్స్‌ సెంటర్‌ తరహాలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనీ భావిస్తున్నారు. కొద్దీ నెలల క్రితమే.. వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు బృందం మంగుళూరు లోని ఈ కేంద్రాన్ని సందర్శించింది. మంగుళూరు ను మించి.. అంతర్జాతీయ తరహా లో ఇక్కడ డెవలప్ చేయాలనీ భావిస్తున్నారు. త్రీడీ షో తో పాటు.. ప్లానిటోరియంలో కాఫీ షాప్, సావనీర్‌ షాపింగ్‌ని కూడా కైలాస గిరి వద్ద ఏర్పాటు చేయనున్నారు. 
 
        ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయడానికి.. కోల్‌కతా ఎన్‌సీఎస్‌ఎం డైరెక్టర్‌ జనరల్‌ అరిజిత్‌ దుత్తాచౌదరి అధ్యక్షతన నలుగురు నిపుణులతో ఓ కమిటి ని ఏర్పాటు చేసారు. ఈ ప్రాజెక్ట్ కోసం కావలసిన.. అనువైన స్థలాన్ని గుర్తించడం తో పాటు.. బిల్డింగ్ వంటి సాంకేతిక అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఇప్పటికే నైపుణ్యం కలిగిన ఆర్కిటెక్ట్ లను వివిధ అర్హత కలిగిన సంస్థలనుంచి ఈ కమిటీ ఆహ్వానించింది. దాదాపు 66 ఆర్కిటెక్ట్ సంస్థలు ఇందులో పోటీ పడగా .. 13 సంస్థలు డిజైన్ లను.. పత్రాలను సమర్పించాయి.  ఈ డిజైన్ లలో స్టూడియో ఎమర్జెన్స్‌ సంస్థ రూపొందించిన డిజైన్‌ని ఎంపిక చేసి.. ఈ డిజైన్ ప్రకారం నిర్మాణం జరగాలని నిర్ణయించారు.  అలానే.. ఈ డిజైన్ కు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులకు.. ఇంజినీరింగ్‌ స్ట్రక్చరల్‌ వ్యవహారాలపై  సలహాలు తీసుకునేందుకు  స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లతో త్వరలోనే ఈ కమిటీ చర్చ జరపనుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox