Breaking News

నేడు నిర్జల ఏకాదశి..ఓ ముఖ్యమయిన పండుగ...!

02 nd Jun 2020, UTC
నేడు నిర్జల ఏకాదశి..ఓ ముఖ్యమయిన పండుగ...!
జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజును నిర్జల ఏకాదశి గా పిలుస్తారు. నేడు వ్రతం చేసుకుని శ్రీ మహా విష్ణువు ని పూజిస్తే ఎన్నో ఫలితాలుంటాయి. సనాతన ధర్మంలో 24 ఏకాదశుల వివరణ ఉంది. ఒకవేళ అధికమాసం లేదా మాలమాసం వస్తే.. రెండు ఏకాదశులు అదనం గా కలిసి మొత్తం 26 ఏకాదశులను సనాతన ధర్మం వివరించింది. ఏకాదశి ఎంత శుభప్రదమైనదో..అందరికి తెలిసిందే.. కానీ నిర్జల ఏకాదశి వాటన్నిటికంటే పవిత్రమైనది. ఈ రోజు ఉపవాసం ఉండి 24 ఏకాదశులు ఉపవాసం ఉన్నంత ఫలితం లభిస్తుంది.  ఈ పర్వదినాన నీటిని తాగడం పూర్తిగా మానివేస్తారు.  అందుకే ఈ ఏకాదశి ని నిర్జల ఏకాదశి గా పిలుస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజును భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. మరి ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి? నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని ఎందుకు అంటారు? ఆ విశేషాలు మనం ఇపుడు తెలుసుకుందాం.
        నిర్జల ఏకాదశి జూన్ 1 మధ్యాహ్నం 2.57కి ప్రారంభమై.. జూన్ 2 మధ్యాహ్నం 12.04 గంటలకు ముగుస్తుంది. ఈ కారణంగా శ్రీ మహావిష్ణువుకు ఈ రోజు మధ్యాహ్నం 12.04 గంటల వరకు వ్రతం చేస్తారు. వేద పండితులు ప్రకారం గంగా దసరా నుంచి ఈ రోజు వరకు ఉపవాసం ఉండాలని చెబుతారు. ఉల్లిపాయలు, అల్లంతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రిపూట కేవలం నేల మీద మాత్రమే నిద్రించాలి. మరుసటి రోజు ఉదయాన్ని బ్రహ్మముహూర్తంలో లేచి శ్రీ హరిని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అనంతరం తలంటి స్నానమాచరించి వ్రత సంకాల్పానికి ప్రతీనబూనాలి. పసుపు వస్త్రాలతో సూర్యదేవుని పూజించాలి.. సూర్యభగవానుడికి జలం సమర్పించిన అనంతరం శ్రీ మహావిష్ణువుకు పూలు, పండ్లు, అక్షతలు, చందనంతో పూజ చేయాలి. "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని జపించాలి. అనంతరం ఏకాదశికి సంబంధించిన కథ చెబుతూ హారతి సమర్పించాలి. అదే రోజు న జలం తీసుకోకుండా నిర్జల ఉపవాసం ఆచరించాలి.. ద్వాదశి రోజు ఉపవాసాన్ని ముగించాలి. మొదటగా శ్రీ మహా విష్ణువును ప్రసన్నం చేసుకోవాలి. స్వామి ప్రసాదాన్ని మిఠాయితో తయారు చేసి ప్రతి ఒక్కరకు అందించాలి. బ్రాహ్మణులకు ప్రసాదాన్ని అందిస్తే వారి శక్తి సామర్థ్యాల ప్రసాదం ద్వారా మీకు లభిస్తాయి. మొత్తం ఉపవాసం అయిన తర్వాతా మాత్రమే మీరు నీటిని తాగాలి.
    పురాణాల్లో ఈ రోజును గురించి తెలియ చెప్పే ప్రత్యేక కధ ఉంది. వేదవ్యాసుడు ఏకాదశి ప్రాముఖ్యాన్ని వివరిస్తూ... ఆరోజు ఉపవాసం ఉండాలని చెప్పగా... ఆయన చెప్పిన మాటలకూ భీమసేనుడు విచారం వ్యక్తం చేసారు. భీమసేనుడు వేదవ్యాసునికి తన సమస్య గురించి ఇలా చెప్పాడు..""స్వామి మీరు ప్రతి పదిహేను రోజులకోసారి వచ్చే ఏకాదశికి ఉపవాసం ఉండాలని చెబుతున్నారు. నేను ఒక్క రోజు కూడా తినకుండా ఉండనలేను. ఆకలితో నా కడుపులో వ్రక్ అనే అనే అగ్ని పుడుతుంది. అతడిని శాంతించేందుకు నేను తప్పనిసరిగా కొంతమందికి సరిపడా బోజనం చేయాల్సిందే. మరి ఏకాదశి రోజు తినకుండా వ్రతం ఎలా ఆచరించగలను" అని అడిగాడు. అతని సమస్యను విన్న వేదవ్యాసుడు అతనిలో మనో ధైర్యం పెంచేందుకు ఓ పరిష్కారాన్ని కూడా సూచించారు. ఇరవై నాలుగు ఏకాదశులు ఉండకపోయినా... జ్యేష్టమాసం లో వచ్చే నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని సూచించాడు. వేదవ్యాసుని సలహా మేరకు.. భీష్ముడు నిర్జల ఏకాదశి రోజున ఎలాంటి అంతరాయాలు తావివ్వకుండా ఉపవాసం ఉన్నాడు. అందుకే ఈ పండుగ రోజున పాండవ ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఈ రోజు బ్రాహ్మణులు, నీరు అవసరమైనవారికి స్వచ్ఛమైన మంచినీరును దానం చేస్తే మంచి జరుగుతుందని విశ్వసిస్తుంటారు. ఫలితంగా జీవితంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జీవనం సాగిస్తారని నమ్ముతారు. అంతేకాకుండా సుఖసంతోషాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox