Breaking News

 ఏకాంతంగా తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

13 th Oct 2020, UTC

తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఈవో కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ భ‌ర‌త్ గుప్తా, టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, డీఐజీ కాంతిరాణా టాటా, సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి తదితరులు బ్రహ్మోత్సవాలపై  స‌మీక్ష నిర్వ‌హించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇటీవ‌ల విడుద‌ల చేసిన కొవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఇంతకుముందు  ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌ను అనుమ‌తించి బ్ర‌హ్మోత్స‌వాలను, వాహ‌న‌సేవ‌లను ఆల‌య మాడ వీధుల్లో నిర్వ‌హించాల‌ని భావించింది. ఈ నెల 6న కేంద్రంనూత‌న‌ నిబంధ‌న‌లు విడుద‌ల చేసింది. 200 మందికి మించ‌కుండా మాత్ర‌మే మ‌త‌ప‌ర‌మైన‌, సాంస్కృతిక ఉత్స‌వాలు నిర్వ‌హించాలని సూచించింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలను ఆల‌యం వెలుపల నిర్వ‌హించాల‌ని టీటీడీ నిర్ణయం తీసుకుంది. న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని నిర్ణయించింది.

అక్టోబ‌రు 16 నుండి 24వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వహించనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల మాదదిరిగానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయానికే పరిమితం కానున్నాయి. ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయి. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా స్వామివారికి ఆగ‌మోక్తంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌న్నీ య‌థాత‌థంగా నిర్వ‌హిస్తారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox