Breaking News

సూర్య గ్రహణం.. దేవాలయాల రద్దు..!

20 th Jun 2020, UTC
సూర్య గ్రహణం..  దేవాలయాల రద్దు..!
రేపు అనగా జూన్ 21 న  సూర్య గ్రహణం అన్న సంగతి తెలిసిందే.  ఉదయం 9.15 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. అది మధ్యాహ్నం 12:24కి పూర్తి దశకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 2:07 గంటలకు గ్రహణం విడవడం మొదలవుతుంది మధ్యాహ్నం 3:04 వరకు గ్రహణం ఉంటుంది. అయితే.. సైన్స్ పరం గాను.. మత పరం గాను గ్రహణాలు విశిష్టత ఉన్న సంగతి తెలిసిందే. రేపు ఉదయకాలం లో.. సూర్యుడికి, భూమి కి మధ్య చంద్రుడు రాబోతున్నాడు.. అందువల్ల.. సూర్య కాంతి భూమి పై నేరుగా ప్రసరించదు.. అందుకే చంద్రుడు అడ్డు వచ్చిన కాలాన్ని సూర్య గ్రహణ కాలం గా భావిస్తాం. గ్రహణం మొదలయ్యే కాలాన్ని పట్టు కాలమని.. పూర్తయ్యే కాలాన్ని విడుపు కాలమని వ్యవహరిస్తాం.. 
 
           ఈ గ్రహణ కాలం లో దేవాలయాల్లో భక్తులకు అనుమతులు ఇవ్వరు..గ్రహణం పూర్తి అయ్యాక.. శుద్ధి చేసిన తరువాత నే భక్తులను అనుమతిస్తారు. అయితే.. రేపు గ్రహణం కారణం పలు దేవాలయాలను మూసి వేస్తున్నారు. గతం లో గ్రహణం పూర్తి అయ్యాక శుద్ధి కార్యక్రమాలు చేసి తిరిగి భక్తుల్ని అనుమతించే వారు. అయితే.. ఈ సారి ఆదివారం దర్శనాలకు అనుమతించడం లేదని పలు దేవాలయాల అధికారులు చెబుతున్నారు.
 
            ఇప్పటికే.. తిరుమల శ్రీవారి ఆలయం.. సింహాద్రి అప్పన్న దేవాలయ అధికారులు ఆదివారం నాడు దర్శనాలకు అనుమతించడం లేదని ప్రకటించారు. సింహాద్రి అప్పన్న దేవాలయం లో మధ్యాహ్నం 3 గంటల తరువాత ఆలయంలో సుప్రభాతం, ప్రాత:కాల ఆరాధనతో ప్రారంభించి గ్రహణ సంప్రోక్షణ, బాలభోగం, రాజభోగం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ దేవాలయం లో భక్తుల దర్శనాలను తిరిగి 22 వ తేదీ ఉదయం ఏడు గంటలనుంచి ప్రారంభిస్తామని తెలిపారు.
            మరో వైపు తిరుమల శ్రీవారి దర్శనాలను కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. శనివారం రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ అనంతరం శ్రీవారి ఆలయ తలుపులు మూసి వేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.  ఆదివారం గ్రహణం వీడిన తరువాత తిరిగి ఆలయాన్ని తెరుస్తామని.. మధ్యాహ్నం నుంచి శ్రీవారి నిత్యా సేవలు ప్రారంభం అవుతాయని అన్నారు. సుప్రభాతం, శుద్ధి, పుణ్యాహవచనం, తోమాల సేవ, కొలువు, ఏకాంతసేవ  నిర్వహించనున్నట్లు తిరుమల అధికారులు తెలిపారు. ఈ క్రమం లో ఆదివారం రోజున భక్తులను అనుమతించేది లేదని అన్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox