Breaking News

"ధర్మ పరిరక్షణ దీక్ష" లో పాల్గొన్న పవన్ కళ్యాణ్..!

10 th Sep 2020, UTC

హైదరాబాద్: జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాదు లోని తన నివాసం లో  "ధర్మ పరిరక్షణ దీక్ష" లో పాల్గొన్నారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం రథం ‌ అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఘటన పట్ల ప్రభుత్వం స్పందించిన తీరుని పవన్ కళ్యాణ్ నిరసించారు. హిందూ దేవాల‌యాల విష‌యంలో చోటు చేసుకుంటోన్న ప‌రిణామాలను నిర‌సిస్తూ పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేస్తున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు.

"దేవతామూర్తులు, ఉత్సవ రథాల విధ్వంసంపై ప్రభుత్వ నిర్లిప్త వైఖరికి నిరసనగా, జనసేన-బీజేపీ సంయుక్తంగా పిలుపునిచ్చిన "ధర్మ పరిరక్షణ దీక్ష" లో భాగంగా హైదరాబాద్ లోని తన నివాసంలో ప‌వ‌న్ ఇందులో పాల్గొన్నారు" అని జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.. పవన్ కళ్యాణ్ ఆఫీసు ఆవ‌ర‌ణ‌లో కుర్చీలో కూర్చొని పుస్త‌కం చ‌దువుతూ ఈ దీక్ష లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా అన్ని జిల్లాలోనూ ఈ దీక్షను పాటించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మరో వైపు.. రాష్ట్ర వ్యాప్తం గా జనసేన కార్యకర్తలు , నేతలు కూడా ఈ దీక్ష చేపడుతున్నారు. బీజేపీ నేతలు కూడా తమ తమ ఇళ్లవద్ద దీక్షలు చేపట్టారు.. దేవాదాయ ఆస్తుల‌ను కాపాడాల‌ని ఇటు బీజీపీ..అటు జనసేన డిమాండ్ చేస్తున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox