Breaking News

వేదాల్లో వినాయకుడి చరిత్ర..!

22 nd Aug 2020, UTC
వేదాల్లో వినాయకుడి చరిత్ర..!

సనాతన సంప్రదాయం ప్రకారం ఏ పూజలు చేపట్టినా, ఏ యజ్ఞ యాగాదులు చేపట్టినా వినాయకుడికే తొలిపూజ చేసి, ఆ తర్వాత మిగిలిన క్రతువులను కొనసాగించడం ఆనవాయితీ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడు ప్రమథ గణాలకు ఆధిపత్యం పొందినందున. గణపతిగా, విఘ్నాలను నివారించే దేవుడు కనుక విఘ్నేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.  మరి.. అలాంటి గణపతి ఎలా విశ్వవ్యాప్తమయ్యాడో ఓసారి చూద్దాం..

మన దేశంలో  వినాయకుడిని గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాధుడు వంటి అనేక నామాలతో అర్చిస్తారు. హిందూమతంలో పూజింపబడే అనేక దేవతామూర్తులలో దాదాపు అన్ని సంప్రదాయాలలోను అన్ని ప్రాంతాలలోను బహుళంగా పూజలకు అందుకునే దేవుడు వినాయకుడు.. వైదిక కాలంనుండి, అంతకుముందు ఉన్న కొన్ని విశ్వాసాలు వినాయకుని సూచిస్తున్నప్పటికీ క్రీ.శ. 4వ, 5వ శతాబ్దాలలో, ప్రత్యేకించి గుప్తుల కాలంలో వినాయకునికి ఇప్పుడు మనం పూజించే రూపం, లక్షణాలు, సంప్రదాయాలు ధార్మిక సమాజంలో రూపుదిద్దుకున్నట్లుగా అనిపిస్తుంది. తరువాత వినాయకుని పూజ చాలా వేగంగా ప్రాచుర్యం పొందిందని చరిత్ర చెబుతోంది..

భారతీయ శిల్ప, చిత్ర కళలలో వినాయకుని మూర్తీకరణ విస్తృతంగా, చాలా వైవిధ్యంతో కనిపిస్తుంది. కాల క్రమంలో వినాయకుని చిత్రించే, శిల్పించే విధానం మారుతూ వస్తుంది.. నిలబడినట్లుగాను, నృత్యం చేస్తున్నట్లుగాను, రాక్షసులతో యుద్ధం చేస్తున్నట్లుగాను, కుటుంబంలో బాలునిగా ఆడుకొంటున్నట్లుగాను, నేలపై కూర్చున్నట్లు, సింహాసనాశీనుడైనట్లు - ఇలా వివిధ సన్నివేశాలలో గణపతి శిల్పాళు, చిత్రాలు కనిపిస్తుంటాయి.. అయితే.. క్రీ.శ. 2వ శతాబ్దం నాటికే శ్రీలంకలో వినాయకుడి విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తున్నది. మిహింతలెలోని కంటకచైత్యంలో లభించిన వినాయక విగ్రహం క్రీ.పూ. 1వ శతాబ్దానికి చెందినదని అంచనా వేశారు. మనకు లభించిన గణేశ విగ్రహాలలో ఇదే అత్యంత పురాతనమైనది కావడం విశేషం. ఇక, 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో వినాయకుని విగ్రహాలు సాధారణమయ్యాయట..

ఇక.. వినాయకుడు విఘ్నాధిపతిగా గుర్తింపబడిన తరువాత.. స్వామి ఆకారం సాధారణంగా కుడిప్రక్క చూపిన విగ్రహంవలె ఉంటూ వచ్చింది.. ఏనుగు తల, బానపొట్ట, ఒకచేత విరిగిన దంతం, మరొకచేతిలో ఉన్న లడ్డూను స్పృశిస్తున్న తొండం - ఇవి సాధారణంగా కనిపించే చిహ్నాలు.. ఎల్లోరా గుహల్లో మరింత పురాతనమైన గణేశ విగ్రహం లభించింది.. కాని అందులో చేతుల చిహ్నాలు స్పష్టంగా తెలియలేదు.. సాధారణంగా వినాయకుని విగ్రహాలలోని పైచేతులలో ఒకచేత అంకుశం మరొక చేత పాశం కనిపిస్తాయి. క్రింది చేతులలో ఒకచేత దంతం, మరొకచేత లడ్డూ ఉన్నట్లు చూపుతారు. ఆధునిక రూపాలలో దంతం ఉన్న చేతిబదులు అభయముద్రలో ఉన్న చేతిని చూపుతున్నారు.నృత్యం చేస్తున్నట్లున్న గణపతి మూర్తులలో కూడా నాలుగు చేతులను ఇలానే చూపుతుంటారు..ఆదినుండి వినాయకుడిని ఏనుగుతలతోనే చిత్రీకరిస్తున్నారనిపిస్తున్నది. ఇలా ఏనుగు తల ఉండడానికి అనేక పురాణ గాధలున్నాయి. "హేరంబ గణపతి"ని ఐదు తలలతో చూపుతారు.

వినాయకునికి ఏక దంతుడు అన్న పేరు మొదటినుండి ఉంది. చాలా పురాతనమైన విగ్రహాలలో కూడా వినాయకుడు తన విరిగిన దంతాన్ని చేతబట్టుకొన్నట్లుగా చూపారు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుని రెండవ అవతారం "ఏకదంతావతారం".అలాగే గుప్తుల కాలం నుండి కూడా వినాయకుడికి పెద్ద పొట్ట ఉండడం వినాయకుని శిల్పాల్లో కనిపిస్తున్న అంశం.. ముద్గల పురాణంలో చెప్పిన రెండు అవతారాలైన   హేరంబుడు, మహోదరుడు  ఈ పెద్దపొట్ట అనే అంశం ప్రాముఖ్యాన్ని సూచిస్తున్నాయి.. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తూ తన ఉదరంలో ఉంచుకొన్నందున అతనికి "లంబోదరుడు" అనే పేరు వచ్చిందని బ్రహ్మాండ పురాణములో ఉంది.. ఇక కొన్ని రూపాల్లో వినాయకునికి రెండు చేతులనుండి, 16 చేతుల వరకు చూపిస్తారు.

అటు..  9వ, 10వ శతాబ్దాలలో వినాయకుడికి  14 నుంచి 20 చేతుల వరకు ఉన్న ప్రతిమలు చెక్కారట..  ఇక.. వినాయకుని చిత్రీకరణలో సర్పం కూడా చాలా సాధారణంగా కనిపిస్తుంది.. ఇది విగ్రహ రూపాల్లో అనేక రకాలుగా చూపిస్తుంటారు.. గణేశ పురాణం ప్రకారం వినాయకుడు వాసుకిని తన కంఠానికి చుట్టుకొన్నాడు.మరి కొన్ని మూర్తులలో సర్పం యజ్ఞోపవీతంగా చూపబడింది. . ఇక.. వినాయకుడి నుదురుమీద తిలకాన్ని, కొన్ని సార్లు మూడవ నేత్రాన్ని చూపిస్తారు.. అయితే..  గణేశ పురాణం ప్రకారం వినాయకుని తలమీద తిలక చిహ్నం మరియు చంద్రవంక కూడా ఉంటాయి. ముఖ్యంగా "బాలచంద్ర వినాయకుడు" అనే రూపంలో చంద్రవంకను చూపుతారు..

ఇక.. వినాయకుని వివిధ రూపాలకు వివిధ వర్ణాలు ఆపాదించబడ్డాయి.. వీటిని గురించి శ్రీతత్వనిధి అనే శిల్పగ్రంధంలో వివరించారు.. ఉదాహరణకు హేరంబ గణపతిని, ఋణమోచన గణపతిని తెలుపు రంగులోను, ఏకదంత గణపతిని నీలిరంగులోను, దుర్గాగణపతిని బంగారు వర్ణంలోను,  సృష్టిగణపతిని ఎరుపు రంగులోను చూపిస్తారు.. ఇక.. హిందూమతంలో ప్రణవ మంత్రం అయిన ఓంకార స్వరూపమే వినాయకుడని అంటారు.. వినాయకుడి రూపము ఓంకారంలా ఉంటుందని చెబుతుంటారు. ముఖ్యంగా దేవనాగరి, తమిళ లిపులలో గణపతి అధర్వశీర్షంలో  వినాయకుడి గురించిన ప్రస్తావన ఇలా ఉంది.. గణపతీ! నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులవు..  నీవే ఇంద్రుడవు.. నీవే అగ్నివి, వాయువువు, సూర్యుడవు, చంద్రుడవు, నీవే భూలోకము, అంతరిక్షము, స్వర్గము. నీవే ఓంకారము.

కుండలినీ యోగము ప్రకారంము షట్చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు.. ఈ చక్రంలోనే కుండలినీ శక్తి సాధారణంగా అంతస్థితమై ఉంటుంది.. వినాయకుని రూపంలో సర్పాన్ని చూపించడానికి, మూలాధార చక్రంతో ఉన్న సంబంధానికి సాఱూప్యం చెబుతుంటారు.. గణపతి అధర్వశీర్షంలో కూడా ఈ విషయం చెప్పబడింది. అంటే..  వినాయకుడు అన్నింటికీ "మూలాధారము" అన్నది జగత్విఖ్యాతం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox