Breaking News

కరోనా బాధితుడితో డాక్టర్ గణేష్

22 nd Aug 2020, UTC
కరోనా బాధితుడితో డాక్టర్ గణేష్
 
బెంగుళూర్ :ఒక వైపు దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు. మరోవైపు  ఈరోజు గణేష్ చతుర్థి ఈ సమయంలో బెంగళూరుకు చెందిన శిల్పి శ్రీధ‌ర్, గ‌ణేశుడు, కరోనా అనే రెండు ఇతివృత్తాలను తీసుకుని, అద్భుత‌మైన విగ్ర‌హాల‌ను తీర్చిదిద్దారు. ఇందులో గ‌ణేశునికి వైద్యుని రూపం ఇచ్చారు. మనమంతా కరోనాతో పోరాడుతున్నాం. ఈ అంటువ్యాధిని త‌రిమికొట్టాల‌ని గణేశుడిని అంద‌రూ ప్రార్థించాలని కోరుతున్నాన‌ని శ్రీధర్ పేర్కొన్నారు. 
 
శ్రీధ‌ర్ రూపొందించిన ఈ శిల్పంలో స్ట్రెచర్‌పై పడుకన్న కరోనా బాధితునికి డాక్ట‌ర్ గ‌ణేశ్ వైద్యం అందిస్తున్నారు. ఇందులో గ‌ణేశుడు తెల్ల కోటు ధరించి, మెడ‌లో స్టెత‌స్కోపుతో క‌నిపిస్తున్నాడు. ఇంతేకాకుండా స‌మీపంలోనే అంబులెన్సుల నమూనాలు కూడా ఉన్నాయి. గణేశుని వాహ‌న‌మైన ఎలుక కూడా క‌రోనా బాధితునికి వైద్య‌ సహాయం అందిస్తోంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox