Breaking News

విదేశాల్లో వినాయకుడి పేర్లు తెలుసా..?

22 nd Aug 2020, UTC
విదేశాల్లో వినాయకుడి పేర్లు తెలుసా..?

వినాయకుడు.. విఘ్నేశ్వరుడు.. గణపతి.. గణేశుడు.. ఈ పేర్లన్నీ మనకు తెలిసినవే కదూ.. మరి ఈ పేర్లు చూడండి.. సాగ్‌ గి దాగ్‌ పో,మార్‌చెన్‌, కాంగి-టెన్‌, షో-టెన్‌, ఫ్రా ఫికానెట్‌.. ఇవేమిటి అనుకుంటున్నారా..? ఇవీ మన  గణనాథుడి పేర్లేనండీ..  టిబెట్‌, జపాన్‌, థాయ్‌లాండ్‌, కంబోడియా, బర్మా, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల్లో కూడా మన గణనాథుడు పూజలందుకున్నాడు.. అయితే..  కాలక్రమంలో వేర్వేరు కారణాల వల్ల ఆయా దేశాల్లో వినాయకుడి ఆరాధన మరుగున పడింది. మరి కొన్ని దేశాల్లో అలనాటి ఆనవాళ్లు మాత్రం రేఖామాత్రంగా మిగిలాయి.. మరి ఆ విశేషాలేమిటో ఇప్పుడు చూసేద్దాం రండి..

భారతదేశంతో పాటు పలు దేశాల్లో వినాయకుడి ఆరాధన వేల ఏళ్ల కిందటే ఉండేదనేందుకు అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి.. ప్రమథ గణనాయకుడైన వినాయకుడు నిజానికి విశ్వవినాయకుడు. భారత భూభాగానికి వెలుపల గజాననుడి ఆరాధన విశేషాలు తెలిస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే.. విదేశీయులు ఎలిఫెంట్ ఫేస్ గాడ్ అంటూ తమకు తోచిన పదజాలంతో  ముద్దుగా పిలుచుకుంటారు.. నిజానికి వినాయకుడు  సర్వాంతర్యామి అనే పదానికి అక్షరాలా సరిపోతాడు..  వెతికితే ఆయన జాడలు.. ప్రపంచ వ్యాప్తంగా స్పష్టాతి స్పష్టంగా కనిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.. 

వినాయకుణ్ని వ్యాపారవర్గాల వారు విశేషంగా ఆరాధించేవారు. సముద్ర వర్తకుల పుణ్యమా అని వినాయకుడు భారత భూభాగాన్ని దాటి బర్మా, థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, కంబోడియా, వియత్నాం, జపాన్‌ తదితర దేశాలకు విస్తరించాడు. హిందువుల జనాభా ఎక్కువగా ఉండే నేపాల్‌లోను, శ్రీలంకలోను, నేపాల్‌కు పొరుగునే ఉండే భూటాన్, టిబెట్‌ ప్రాంతాలలో కూడా శతాబ్దాల కిందటే వినాయకుడి ఆరాధన ఉండేది. హిందూ మతస్తులతో పాటు వారితో సన్నిహితంగా మెలగిన జైనులు, బౌద్ధులు కూడా వినాయకుణ్ని ఆరాధించేవారు..వినాయకుడి ఆరాధన మన దేశం నుంచి ఇతర దేశాలకు ప్రధానంగా బౌద్ధం ద్వారా, కొన్నిచోట్ల జైన మతం ద్వారా వ్యాపించిందనే చెప్పుకోవాలి..

జైన మత నిబంధనలకు సంబంధించిన సాహిత్యంలో ఎక్కడా వినాయకుడి ప్రస్తావన కనిపించకపోయినా, జైనులు వినాయకుణ్ని శతాబ్దాల కిందటే ఆరాధించేవారనేందుకు ఆధారాలు ఉన్నాయి. పన్నెండో శతాబ్దికి చెందిన జైన గురువు హేమచంద్ర రాసిన ‘అభిధాన చింతామణి’, పదిహేనో శతాబ్దికి చెందిన జైన గురువు వర్ధమాన సూరి రాసిన ‘ఆచార దినకర’ వంటి గ్రంథాలలో వినాయకుడి ప్రస్తావన కనిపిస్తుంది. వినాయకుణ్ని ఈ గ్రంథాలలో హేరంబుడిగా, గణవిఘ్నేశుడిగా, వినాయకుడిగా అభివర్ణించారు. ఇవి శ్వేతాంబర జైన గ్రంథాలు. దిగంబర జైన గ్రంథాలలో వినాయకుడి ప్రస్తావన పెద్దగా కనిపించదు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చేరువలోని ఖండగిరి, ఉదయగిరి గుహలలోను, మథురలోను మధ్యయుగాల నాటి జైన ఆరాధనా కేంద్రాలలో వినాయకుడి శిల్పాలు కనిపిస్తాయి. రాజస్తాన్, గుజరాత్‌లలోని జైన ఆలయాల్లోనూ వినాయకుడి చిత్రాలు కనిపిస్తాయి..

ప్రాచీన బౌద్ధ గ్రంథాలలో వినాయకుడి ప్రస్తావన కనిపిస్తుంది. గుప్తుల కాలం నాటి బౌద్ధ శిల్పాలలో వినాయకుడి శిల్పాలు కూడా కనిపిస్తాయి. టిబెటన్ల వినాయకుడు రుధిరవర్ణంలో ఉగ్రరూపంలో కనిపిస్తాడు. ‘మహారక్త’ గణపతిగా టిబెటన్లు వినాయకుణ్ని తాంత్రిక పద్ధతుల్లో కొలిచేవారు. టిబెట్‌లోని వజ్రయాన బౌద్ధులు, చైనాలోని షింగాన్‌ బౌద్ధులు వినాయకుణ్ని ఆరాధించేవారు. షింగాన్‌ బౌద్ధుల ద్వారానే వినాయకుడి ఆరాధన జపాన్‌కు పాకింది. జపాన్‌ రాజధాని టోక్యో శివార్లలోని అసాకుసా ప్రాంతంలో పన్నెండో శతాబ్ది నాటి గణపతి ఆలయం ఉంది..

బౌద్ధులు గణపతిని తమ దైవాలలో ఒకరిగా ఆరాధిస్తే, హిందువుల గణపతి పురాణం, ముద్గల పురాణాలు బుద్ధుణ్ని గణపతి అవతారంగా అభివర్ణించడం విశేషం. థాయ్‌లాండ్‌ వాసులు వినాయకుణ్ని ఆరాధించడం ద్వారా అదృష్టం కలసి వస్తుందని, విజయాలు వరిస్తాయని విశ్వసిస్తారు. ఇండోనేసియన్లు గణపతిని జ్ఞానప్రదాతగా పూజిస్తారు. ఇండోనేసియాలోని బేండుంగ్‌లో గణేశుడి పేరిట ఒక వీధి ఉంది. జావాకు చేరువలోని ఒక దీవిలో క్రీస్తుశకం ఒకటో శతాబ్ది నాటి పురాతన వినాయకుడి విగ్రహం బయటపడింది. ఇండోనేసియాలోని ప్రంబానన్‌ ఆలయంలో తొమ్మిదో శతాబ్ది నాటి వినాయకుడి విగ్రహం ఉంది. ఇవన్నీ ప్రాచీనకాలం నుంచే ఇతర దేశాల్లోని వినాయకుడి ఆరాధనకు, ఉనికికి నిదర్శనంగా నేటికీ నిలిచి ఉన్నాయి..

ఇక.. విదేశాల గురించి చెప్పుకోవాలంటే.. టిబెట్‌లో వినాయకుడిని సాగ్‌ గి దాగ్‌ పొ, మార్‌ చెన్‌గా వ్యవహరిస్తారు. గణాలకు అధిపతి అయిన అరుణ దేవుడు అని దీని అర్థం. దీనికి అనుగుణంగా టిబెటన్ల వినాయకుడు ఎర్రటి ఎరుపురంగులో ఉంటాడు. అందుకే ఈ స్వామిని ‘మహారక్త’గా కూడా వ్యవహరిస్తుంటారు. అలాగే.. టిబెటన్లు సంపదనిచ్చే ఐదుగురు దేవుళ్లను కొలుస్తారు. టిబెటన్‌ పురాణాల ప్రకారం వారు జంభాలాలుగా పిలుచుకునే ఈ దేవుళ్లందరూ బుద్ధుడి అవతారాలే.

ఇక జపాన్‌లో గణేశుడిని కాంగి-టెన్‌గా కొలుస్తారు. వినాయకుడికి వారు పెరుగు, తేనె, పిండితో తయారుచేసిన రొట్టెలను సమర్పిస్తారు. జపనీయులు గణేశుడిని ఇంకా చాలా పేర్లతో పిలుస్తారు. గణబచి, వినాయక -టెన్‌, బినాయక-టెన్‌, గణపతెయ్‌, జోబి-టెన్‌, దైషో కాంగి-టెన్‌, కాంగి జిజాయ్‌-టెన్‌ వంటివి ఆ పేర్లలో కొన్ని పేర్లు..1832 నాటికి జపాన్‌లో వినాయకుడికి దాదాపు 131 ఆలయాలు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది..

ఇక థాయ్‌ల్యాండ్‌లో గణేశుడిని ఫ్రాఫికనేసువాన్‌గా కొలుస్తారు. అదృష్టానికి, విజయానికి ప్రతీకగా.. అడ్డంకులను తొలగించే దేవుడిగా భావిస్తారు. థాయ్‌వ్యాప్తంగా వినాయకుడికి పలు ఆలయాలున్నాయి. వీటిలో ప్రధానమైనది.. సెంట్రల్‌ బ్యాంకాక్‌లోని రాయల్‌ బ్రాహ్మిన్‌ టెంపుల్‌. జావాలో గణనాథుడిని జ్ఞానమిచ్చే దేవుడిగా పూజిస్తారు. ఇండోనేషియా కరెన్సీపై గణేశుడి చిత్రాలు చిరపరిచితమే. అఫ్గానిస్థాన్‌, చైనాల్లో సైతం గణేశుడి ఆరాధన ఉంది. అఫ్గానిస్థాన్‌లో 5 నుంచి 7వ శతాబ్దకాలం నాటివిగా భావిస్తున్న కొన్ని గణేశ విగ్రహాలున్నాయి. ఇక ఇప్పుడు.. ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా అనేక దేశాల్లో ఉంటున్న హిందువులు వినాయకుడిని స్థానికులకు పరిచయం చేస్తున్నారు.. ఈ రకంగా విఘ్నాలను తొలగించే వినాయకుడు విశ్వవ్యాప్తమయ్యాడు.. విశ్వనాయకుడయ్యాడు..

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox