Breaking News

ఖైరతాబాద్ లో ధన్వంతరీ నారాయణ మహాగణపతి

22 nd Aug 2020, UTC
ఖైరతాబాద్ లో ధన్వంతరీ నారాయణ మహాగణపతి
 
ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణనాథుడికి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ దంపతులు తొలి పూజ నిర్వహించి పది కిలోల వెండిని గణపతికి బహుకరించారు. పద్మశాలి సంఘం కండువ, గరక మాల, జంజెం, పట్టు వస్త్రాలను  సమర్పించింది.
 
ఆంధప్రదేశ్‌లోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ వారు ప్రత్యేక తయారు చేసిన 100 కిలోల లడ్డూ ప్రసాదం అందజేసారు. ఈ సారి తొమ్మిదిఅడుగుల ఎత్తులో  మట్టితో గణపతిని ప్రతిష్టించారు. కరోనా కారణంగా వేడుకలను నిరాడంబరంగా జరుపుతున్నారు. కోవిడ్‌ నిబంధనలు నేపథ్యంలో వేలాదిగా ఒకేసారి తరలివచ్చే భక్తులను కట్టడిచేసేందుకు ఆన్‌లైన్లో మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. భక్తులను గుంపులుగా పోలీసులు అనుమతించడం లేదు.  

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox