Breaking News

రామజన్మభూమి పూజారి, 16 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

30 th Jul 2020, UTC

అయోధ్యఅయోధ్యలో  రామ జన్మభూమి మందిర పూజారికి . ప్రధాన పూజారి సహాయకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అంతేకాక ఇక్కడ విధులు నిర్వహిస్తోన్న మరో 16 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం.

కరోనా సోకినట్లు తెలియడంతో ఇక్కడి పూజారులు, పోలీసులు ఆందోళనకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన ప్రభుత్వాధికారులు. అయోధ్య ప్రాంతంలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. కాగా, ఆగస్టు 5వ తేదీన జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని హాజరవుతున్న క్రమంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 200 మందితో ఈ భూమి పూజ కార్యక్రమం జరగబోతోంది. 
 
అయోధ్యలో జరిగే ఈ భూమి పూజ కార్యక్రమాన్ని వీక్షించేందుకు గాను నగరం అంతటా భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ఊపందుకున్నాయి. భూమి పూజ కార్యక్రమానికి హాజరవుతున్న నరేంద్ర మోదీ హెలిప్యాడ్‌ నగరంలోని సాకేత్‌ కాలేజీలో దిగుతుంది. అక్కడ నుంచి ప్రధాని కాన్వాయ్‌లో వేడుక జరిగే ప్రదేశానికి చేరుకుంటారు. 
 
 రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాల గోడలపై రామాయణంలోని వేర్వేరు పాత్రలను చిత్రీకరించనున్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల పరిధి మేర ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు అయోధ్య సమాచార డిప్యూటీ డైరెక్టర్‌ ధార్‌ సింగ్‌ తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox