Breaking News

వికీలీక్స్ వ్యవస్థాపకుడు పై అమెరికా ఆరోపణలు..!

25 th Jun 2020, UTC

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ ఆసాంజేపై అమెరికా న్యాయ శాఖ సంచలన అభియోగాలు మోపింది. లుల్జ్‌సెక్ సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక సైబర్ దాడుల్లో ప్రమేయం ఉన్న మరికొన్నిగుర్తుతెలియని గ్రూప్‌లతో కలిసి ఆయన తమ దేశంపై కుట్రపన్నారని ఆరోపించింది.  

2012లో లుల్జ్‌సెక్ అధినేతకు హ్యాక్ చేయాల్సిన టార్గెట్స్ జాబితాను అసాంజే అందజేశారనీ.. అందులోనూ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీ, నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీ, న్యూయార్క్ టైమ్స్ తదితర సంస్థల నుంచి అత్యంత ప్రభావితం చేసే సమాచారాన్ని లీక్ చేయాలని  అతడితో అసాంజే చెప్పినట్టు అమెరికా న్యాయశాఖ ఆరోపించింది.

అమెరికా ఇంటిలిజెన్స్ కన్సల్టింగ్ ఏజెన్సీపై సైబర్ దాడికి దిగి ఈమెయిల్స్ దొంగిలించిన లుల్జ్‌సెక్ సంబంధిత హ్యాకర్లు.. వాటిని వికీలీక్స్‌లో విడుదల చేసినట్టు అమెరికా పేర్కొంది. కాగా అదే కంపెనీపై మరోసారి దాడిచేయాలని కూడా అసాంజే పరోక్షంగా లుల్జ్‌సెక్‌ యజమానికి చెప్పినట్టు తెలిపింది.

ప్రస్తుతం యూకే జైల్లో ఉన్న అసాంజేని నేరస్తుల అప్పగింత కింద తమకు అప్పగించాలంటూ అమెరికా న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ప్రకటించిన అభియోగాలను ప్రస్తుత కేసులో కలపకపోయినప్పటికీ.. అతడు కుట్రచేసినట్టు తాము చేస్తున్న ఆరోపణలకు ఇవి మరింత బలం చేకూర్చగలవని అమెరికా పేర్కొంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox