Breaking News

టీవీల ధరలకు రెక్కలు?

15 th Sep 2020, UTC
టీవీల ధరలకు రెక్కలు?
 
న్యూఢిల్లీ :వచ్చే నెల నుంచి టెలివిజన్ ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టీవీ ప్యానెల్స్‌పై ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఈ నెలాఖరుతో నిలిచిపోతున్నందున ఆయా కంపెనీలు టీవీల ధరలు పెంచేందుకు సిద్ధపడుతున్నాయి. సెప్టెంబరు 30 తరువాత డ్యూటీ రాయితీని పొడిగించకపోతే వినియోగదారులకు అదనపు  భారం తప్పదని ఎల్‌జీ, పానాసోనిక్, థామ్సన్, సాన్సుయ్ కంపెనీలు భావిస్తున్నాయి. 32 అంగుళాల టెలివిజన్‌కు 4శాతం లేదా కనిష్టంగా 600 రూపాయలు, 42 అంగుళాల టీవీలపై 1,200-1,500 రూపాయల మేర  ధరలు పెరిగే అవకాశం ఉంది. 
 
గత ఏడాది ఓపెన్ సెల్ ప్యానెళ్లపై ప్రభుత్వం 5 శాతం దిగుమతి సుంకం రాయితీ  ఇచ్చింది. అయితే టెలివిజన్ ఖర్చులో దాదాపు 60 శాతంగా ఉన్న ఒపెన్ సెల్ ప్యానెళ్లపై దిగుమతి సుంకం విధించే బదులు, ప్రభుత్వం దశలవారీగా-ఉత్పాదక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని  స్థానిక తయారీదారులు అంటున్నారు. మరోవైపు శాంసంగ్ తన  ఉత్పత్తిని వియత్నాం నుండి భారతదేశానికి తరలించిన నేపథ్యంలో టీవీ తయారీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగుమతి సుంకం రాయితీని గడువు పెంచేందుకు సానుకూలంగా ఉన్నట్టు  వార్తలు వస్తున్నాయి. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox