Breaking News

స్పైస్‌జెట్‌ పై రాన్సమ్‌వేర్ దాడి.. వందలాది విమానాలు ఆలస్యం

25 th May 2022, UTC

దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌పై రాన్సమ్‌వేర్(ఒక రకమైన మాల్‌వేర్) దాడి జరిగింది. సంస్థ సర్వర్ నెమ్మదించడంతో బుధవారం ఉదయం బయలుదేరాల్సిన వందలాది విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో వేర్వేరు ఎయిర్‌పోర్టుల్లో వేలాది మంది ప్రయాణికులు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు నిర్ధారించారు. మంగళవారం రాత్రి ఈ దాడి జరిగిందని తెలిపారు. ఈ ప్రభావంతో బుధవారం ఉదయం బయలుదేరాల్సిన విమానాలు ఆలస్యమయ్యాయని చెప్పారు. 

కొన్ని స్పైస్‌జెట్ సిస్టమ్‌లు గత రాత్రి రాన్సమ్ వేర్ దాడిని ఎదుర్కొన్నాయి. అది ప్రభావం చూపింది మరియు ఈ రోజు ఉదయం బయలుదేరే విమానాలను ఆలస్యమవుతాయని స్పైస్‌జెట్ ఈ ఉదయం ట్విట్టర్ పోస్ట్‌లో తెలియజేసింది. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత తమ విమానాలు షెడ్యూల్ ప్రకారం పనిచేస్తున్నాయి. మా ఐటి బృందం పరిస్థితిని  సరిదిద్దింది. ఇప్పుడు విమానాలు సాధారణంగా నడుస్తున్నాయి. 

అయితే విమానాల ఆలస్యం గురించి స్పైస్‌జెట్ ఎటువంటి అప్‌డేట్‌లను తెలియజేయలేదని పేర్కొంటూ ప్రయాణికులు తమ ఫిర్యాదులను ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox