Breaking News

RBI: ఏటీఎంలో క్యాష్ లేకపోతే బ్యాంకులకు జరిమానా ఆర్ బీ ఐ నిర్ణయం

11 th Aug 2021, UTC

New Delhi : ఖాళీ ఏటీఎంలతో ప్రజలకు ఎదురవుతున్న అవస్థలపై రిజర్వ్‌ బ్యాంక్‌ దృష్టి సారించింది. ఇకపై ఒక నెలలో మొత్తం 10 గంటలకు మించి ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకుంటే బ్యాంకులకు జరిమానా విధించనుంది.

ఈ నిబంధన ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. బ్యాంకులు, వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లు (డబ్ల్యూఎల్‌ఏవో) ఎప్పటికప్పుడు ఏటీఎంలలో నగదు లభ్యతను పర్యవేక్షించి, సమయానికి భర్తీ చేసేలా తమ యంత్రాంగాలను పటిష్టం చేసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. ఈ నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తామని, జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది. ఒక నెలలో పది గంటలకు మించి ఏ ఏటీఎంలోనైనా నగదు లేకపోతే, ఒక్కో ఏటీఎంకు రూ. 10,000 చొప్పున పెనాల్టీ ఉంటుంది.

వైట్‌ లేబుల్‌ ఏటీఎంల విషయంలో సదరు ఏటీఎంలకు సంబంధించిన నగదు అవసరాలు తీర్చే బ్యాంకులే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని డబ్ల్యూఎల్‌ఏవో నుంచి వసూలు చేసుకోవచ్చు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox