Breaking News

సంక్షోభ సమయంలోనూ విలాసాలా?పంజాబ్ నేషనల్ బ్యాంక్ పై విమర్శలు..!

10 th Jun 2020, UTC

 వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణం...  కరోనా వైరస్ ...దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ .. ఇటువంటి పరిస్దితుల్లో ఏ సంస్దయినా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుకోవడం సహజమే. అయితే  ఇటువంటి  సంక్షోభ సమయంలో కూడ పంజాబ్ నేషనల్  బ్యాంకు టాప్ మేనేజ్ మెంట్ కోసం అత్యంత విలాసవంతమైన  మూడు ఆడి కార్లను కొనుగోలు చేయడం సంచలనం రేపుతోంది.  ఆర్థిక నష్టాలను పట్టించుకోకుండా గత నెలలో సుమారు రూ .1.34 కోట్ల విలువైన  హై-ఎండ్ లగ్జరీ కార్లను కొనడం పై  విమర్శలు రేగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, క్యాబినెట్ మంత్రులు  చాలా తక్కువ ఖరీదైన మారుతి సుజుకి సియాజ్‌ను ఉపయోగిస్తున్నారు. దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్  కూడా టయోటా కరోలా ఆల్టిస్‌ను ఉపయోగించడం గమనార్హం.

అయితే బోర్డు ఆమోదం పొందిన తరువాత, ఫుల్ టైం డైరెక్టర్లకు మంజూరు చేసిన పరిమితిలోనే వీటిని కొనుగోలు చేసినట్లు బ్యాంకు వర్గాలు ప్రకటించాయి. అలాగే గత సంవత్సరం ఉపయోగించకుండా మిగిలిన నిధులతో కలిపి వీటిని కొనుగోలు చేసినట్టు వెల్లడించాయి. పీఎన్‌బీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ కార్లను ఉపయోగిస్తారని తెలిపాయి.

కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలను ప్రారంభించవద్దని ఆర్థిక మంత్రిత్వ శాఖ గత వారం అన్నిమంత్రిత్వ శాఖలను కోరింది. ఈ క్లిష్ట సమయాల్లో మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా వనరులను వివేకంతో ఉపయోగించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox