కరోనా, లాక్డౌన్ సమయంలో వ్యాపారాలు లేక, ఆదాయాలు క్షీణించి దేశంలో పలు కంపెనీలు ఇబ్బందుల్లో పడిపోతే ఆ కంపెనీ మాత్రం తన అమ్మకాలు ఊహించని రీతిలో పెంచుకుంది. ఇంతకీ ఆ కంపెనీ ఏమిటి? లాక్ డౌన్ సమయంలో అమ్మకాలు , ఆదాయాలు ఎలా పెరిగాయి?
ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ పార్లే జీ
1938లో ఈ కంపెనీ స్థాపించిన నాటి నుంచి లేనంతగా ఈ మూడు నెలల స్థాయిలో గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది. , మార్చి- మే నెల మధ్య కాలంలో భారీ అమ్మకాలు జరిగాయి. దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పార్లే జీ బిస్కెట్లను పెద్ద మొత్తాల్లో కొని పంపిణీ చేశాయని దీంతో రికార్డు స్థాయిలో సాగాయని కంపెనీ వెల్లడించింది. దేశంలోని 120 ఫ్యాక్టరీల్లో మార్చి 25వ తేదీనుంచే బిస్కెట్ల ఉత్పత్తి ప్రారంభించామని తెలిపింది. కిలో వందరూపాయల లోపు ధరలోనే పార్లే -జి బిస్కెట్లు లభిస్తున్నందున వీటికి మార్కెట్ లో డిమాండు బాగా పెరిగిందని కంపెనీ వివరించింది.
మొత్తం విక్రయాల్లో ఇవి 50 శాతానికి పై మాటేనని, మొత్తం ఆదాయంలో మూడింట ఒక వంతు ఆదాయాన్ని ఆర్జించిందని కంపెనీ సీనియర్ ప్రతినిధి మయాంక్ షా తెలిపారు. ఒక్క పార్లే జీ మాత్రమే కాకుండా తమ ఇతర బిస్కట్ ఉత్పత్తులకు కూడా డిమాండ్ ఊపందుకుందన్నారు. దీంతో మిగతా అన్ని బిస్కెట్ కంపెనీలతో పోలిస్తే అత్యధిక వృద్ధి రేటు సాధించామన్నారు.
ఈ అసాధారణమైన అమ్మకాలతో పార్లే మార్కెట్ వాటా 4.5 నుండి 5 శాతానికి పెరిగిందన్నారు. గత 30-40 సంవత్సరాలలో, ఈ ఇంతటి వృధ్దిని చూడలేదన్నారు. బ్రాండ్‌పై ప్రజలకున్న నమ్మకానికి తోడు పార్లే జీ బిస్కట్లు ఎక్కువ కాలం నిల్వ ఉండటం ఇంతటి ప్రాధాన్యతకు కారణమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మూడు కోట్ల పార్లేజీ బిస్కెట్లను విరాళంగా ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అమ్మకాలు పెరగడం, దానికి తగ్గట్లుగా ఉత్పత్తిని పెంచి వినియోగదారులకు అందుబాటులో వుండే విధంగా ధరలు వుండటం.. ఇవీ పార్లే బిస్కెట్ల సేల్స్ పెరగడానికి కారణాలు గా చెప్పుకోవచ్చు. లాక్ డౌన్ సమయంలో పిల్లలు, పెద్దలు అందరూ ఇంటిపట్టునే వుండటం, స్నాక్స్ వినియోగంతో బిస్కెట్ల అమ్మాకాలు పెరిగాయి. పార్లే బిస్కెట్ ప్యాకెట్ కనిష్ట ధర రూ.5 వుండటం గమనార్హం.

Read latest వ్యాపార వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Jan 2021
26 Jan 2021
28 Jan 2021
28 Jan 2021