Breaking News

శానిటైజ‌ర్ విక్ర‌యాలు, నిల్వ‌ల‌కు సడలింపులు

30 th Jul 2020, UTC

న్యూఢిల్లీ : శానిటైజ‌ర్ విక్ర‌యాలు, నిల్వ‌ల‌కు ప్రభుత్వ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి చేస్తూ తీసుకున్న నిర్ణ‌యాన్ని కేంద్రం స‌డ‌లించింది. కరోనా నేప‌థ్యంలో శానిటైజ‌ర్లు, మాస్కులు నిత్యజీవితంలో భాగం అయపోయాయి. దీనితో శానిటైజర్లను అందరికీ అందుబాటులో వుంచాలన్న లక్ష్యంతో  కేంద్రం  డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ నిబంధ‌న‌ల నుంచి శానిటైజ‌ర్ల‌కు మిన‌హాయింపు క‌ల్పించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

ప్ర‌స్తుత‌ కోవిడ్ -19మహమ్మారి నేపథ్యంలో శానిటైజర్ అమ్మ‌కాల‌కు డిమాండ్ పెర‌డ‌గంతో కొంద‌రు  కల్తీ అమ్మకాలు, అక్రమనిల్వలకు పాల్పడేవారు. జ‌రిపేవారు. వీటిని అరికట్టే ల‌క్ష్యంతో  శానిటైజ‌ర అమ్మ‌కాలు, నిల్వ‌ల‌పై అనుమ‌తులు త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుత పరిస్దితు కారణంగా వీటిని సడలించింది.

శానిటైజ‌ర్ల కొర‌త త‌లెత్త‌కుండా కొత్త‌గా మ‌రో 600సంస్థ‌ల‌కు త‌యారీ అనుమ‌తుత‌లు ఇస్తూ కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది. డిమాండ్ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచాల‌ని పేర్కొంది. శానిటైజ‌ర్ ధ‌ర‌ల‌పై కూడా ప‌రిమితులు విధిస్తూ నిర్ణ‌యించింది.

అయితే ఈ  ప్ర‌క‌ట‌న త‌ర్వాత శానిటైజ‌ర్ అమ్మ‌కాల‌ను లైసెన్సు నుంచి మిన‌హాయింపులు కోరుతూ ప‌లు విజ్ఞప్తులు కేంద్రానికి అందాయి. దీంతో ప్రజలకు శానిటైజర్ మరింత అందుబాటులో ఉండేందుకు వీలుగా డ్ర‌గ్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ నిబంధ‌న‌ల నుంచి మిన‌హాయింపు క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox