Breaking News

Nita Ambani: ప్రైవేట్ జెట్ లో కిచెన్ వేర్ కొనడానికి శ్రీలంక వెళ్లిన నీతా అంబానీ

06 th Aug 2021, UTC

Business :ఆమె ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తుంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిని వివాహం చేసుకుంది. ఆమె ఇంటిలో దాదాపు 170 కార్లు ఉన్నాయి. ఆమె ఎవరో కాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ. ఆమె తన ఇంటికోసం కిచెన్ వేర్ కొనడానికి  తన ప్రైవేట్ జెట్ లోఏకంగా 1500 కిలోమీటర్లు ప్రయాణించింది.  దీనికి సంబంధించి వివరాలివి.

నీతా అంబానీ తన ఇంటికి కిచెన్ వేర్  కొనుగోలు చేయడానికి ఎంచుకున్నబ్రాండ్ శతాబ్దాల నాటి జపనీస్ బ్రాండ్ నోరిటేక్. జపాన్‌లోని  గ్రామం పేరు  దీనికి పెట్టబడింది, నోరిటేక్ అనేక దశాబ్దాల క్రితం  ఒక ప్రసిద్ధ బ్రాండ్ గా పేరుగాంచింది. . నీతా అంబానీ తన ప్రైవేట్ జెట్ ఎక్కి శ్రీలంకకు వెళ్లి అక్కడ నోరిటేక్ నుండి 25,000  వస్తువులను కొనుగోలు చేసినట్లు తెలిసింది.

అయితే నీతా అంబానీ శ్రీలంకకు వెళ్లడానికి మరియు ఆమె పరిసరాల్లోని అవుట్‌లెట్‌లో నోరిటేక్ కొనకపోవడానికి కారణం ధర వ్యత్యాసం. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, 22 క్యారెట్ల బంగారు ట్రిమ్మింగ్‌లతో కూడిన ఒకే నోరిటేక్ డిన్నర్ సెట్ ఖరీదు భారతదేశంలో 800 డాలర్లనుంచి 2,000 డాలర్ల  మధ్య  వుంటుంది. అదే   శ్రీలంకలో 300 నుంచి 500 డాలర్ల  మధ్య దొరుకుతుంది. రాకపోకలకు అయ్యే విమాన ఇంధనాన్ని లెక్కించినప్పటికీ భారీ ఆర్డర్  కారణంగా అంబానీ  మంచి మొత్తాన్ని ఆదా చేయగలరు. శ్రీలంకలో నోరిటేక్ భారతదేశం కంటే చౌకగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ అన్ని ఉత్పత్తులను తయారు చేసే నోరిటేక్ ఫ్యాక్టరీ ఉంది. అందుకే నీతా అంబానీ  కిచెన్ వేర్ కొనడానికి శ్రీలంక వెళ్లినట్లు తెలుస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox