Breaking News

కార్ల మార్కెట్లో దూసుకుపోతున్న మారుతి సుజుకీ

12 th Jan 2022, UTC

Maruti Suzuki: ప్రముఖ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా లో కార్ల మార్కె ట్లో వేగంగా దూసుకుపోతోంది. కంపెనీ కార్ల అమ్మకాలు అత్యదికంగా సాగుతున్నాయి. గత ఏడాది టాప్‌ 10 ప్యాసింజర్‌ కార్ల  వాహనాల జాబితాలో ఈ కంపెనీకి చెందిన ఎనిమిది మోడళ్లు స్థానం దక్కించుకున్నాయి.ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో  టాప్‌ 10 స్థానం లభించడం ఇదే మొదటిసారని మారుతి కంపనీ వారు తెలిపారు.అత్యధికంగా అమ్ముడైన కార్లలో వ్యాగన్‌ఆర్‌, స్విఫ్ట్‌, బాలెనో, ఆల్టో 800, డిజైర్‌, విటారా బ్రెజ్జా, ఈకో, ఎర్టిగా ఉన్నాయి.

ఎర్టిగా మొదటిసారిగా గత సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన టాప్‌ 10 ప్యాసింజర్‌ వాహనాల్లో చేరింది. 1.83 లక్షలకు పైగా అమ్మకాలతో వ్యాగన్‌ఆర్‌ ఏడాదిలో అత్యధికంగా అమ్ముడైన కారు మోడల్‌గా నిలిచింది. తర్వాతి స్థానాల్లో స్విఫ్ట్‌, బాలెనో, ఆల్టో 800. మారుతి గతేడాది 1.75 లక్షలకు పైగా స్విఫ్ట్‌, 1.72 లక్షలకు పైగా బాలెనో, 1.66 లక్షలకు పైగా ఆల్టో, 1.16 లక్షలకు పైగా డిజైర్‌, 1.15 లక్షలకు పైగా విటారా బ్రెజ్జా, 1.14 లక్షలకు పైగా ఈకో, 1.14 లక్షలకు పైగా ఎర్టిగాలను విక్రయించింది. 

గతఏడాది అమ్ముడైన టాప్‌ 10 మోడళ్లలో ఎనిమిది మారుతి మోడళ్ల వాటా 83 శాతానికి పైగా ఉండగా.. మొత్తం ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాల్లో 38 శాతంగా ఉంది. ఈ కార్లు అత్యదికంగా విక్రయాలు జరగటానికి కారణం మారుతి సుజుకీ  మధ్యతరగతి కుటుంబాలను ఎక్కువగా ఆకర్షించడం, వారికి అనుకూలమైన  రేట్లు ఉండటం  కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox