Breaking News

కేరళ నష్టం తెలంగాణకు లాభం

10 th Jul 2021, UTC
కేరళ నష్టం తెలంగాణకు  లాభం

కేరళ నష్టం తెలంగాణకు లాభంగా మారింది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద పిల్లల వస్త్ర తయారీ సంస్థ కైటెక్స్ గార్మెంట్స్  తాను కేరళలో తలపెట్టిన రూ.3,500 కోట్ల ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీఆర్ వరంగల్ లో  కైటెక్స్ రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ట్వీట్ చేశారు.

మరో వైపు కైటెక్స్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సాబు జాకబ్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాలనకు వ్యతిరేకంగా తీవ్రంగా మాట్లాడారు. తన సొంత రాష్ట్రం కేరళ నుండి వైదొలగడం లేదని, కానీ తాను  వేధించబడినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం తొమ్మిది ఇతర రాష్ట్రాలు తనను పిలిచాయని, జాకబ్ చెప్పారు. కాలంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో కేరళ మారడం లేదని రాష్ట్ర భవిష్యత్తు కోసం తీవ్రమైన పునరాలోచన అవసరమని ఆయన అన్నారు.

"నేను కేరళను విడిచిపెడతానని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఈ రకమైన చికిత్స మరియు అవమానాన్ని ఎంతకాలం కొనసాగించగలను. నేను ప్రయత్నించాను, కానీ ఇకపై చేయలేకపోయాను" అని మిస్టర్ జాకబ్ అన్నారు. 53 సంవత్సరాలుగా నేను ఇక్కడ పారిశ్రామికవేత్తగా పనిచేసి 16,000-20,000 మందితో ఒక విప్లవాన్ని సృష్టించానని ఆయన తెలిపారు. కైటెక్స్ కేరళలో అతిపెద్ద ప్రైవేట్ రంగ యజమాన్య సంస్ద. ఎర్నాకుళంలోని  ఈ సంస్ద వస్త్ర విభాగంలో 15 వేల మంది పేరోల్‌లో ఉన్నారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox