కరోనావైరస్, లాక్డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాన్ని ఎదుర్కొన్న జపాన్ కార్ల తయారీ సంస్థ హోండాకు తాజాగా తగిలిన సైబర్ ఎటాక్ ప్రపంచవ్యాప్తంగా అనేక కర్మాగారాలను ప్రభావితం చేసింది. దీంతో ఈ దాడి నుంచి కోలుకునేందుకు ఇండియా, బ్రెజిల్ హోండా ప్లాంట్లలో కార్యకలాపాలను నిలిపివేసింది.
అంతర్గత సర్వర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ ఎటాక్ జరిగిందని, కంపెనీ సిస్టంల ద్వారా వైరస్ వ్యాపించిందని కంపెనీ ప్రతినిధి బుధవారం వెల్లడించారు. దీంతో భారతదేశం, బ్రెజిల్‌లోని మోటార్‌సైకిల్ ప్లాంట్లను మూసి వేశామన్నారు. అయితే టర్కీలోని కార్ల తయారీ ప్లాంట్ వద్ద బుధవారం తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలను పరిశీలిస్తున్నామని ఆమె చెప్పారు. అయితే దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా హోండా వ్యాపారంపై పరిమితంగానే ఉంటుందన్నారు.
సైబర్ దాడి కారణంగా యుఎస్ లో ఐదు సహా, మొత్తం11 హోండా ప్లాంట్లను ప్రభావితం చేసినట్టు సమాచారం. అయితే యుఎస్ ప్లాంట్లు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాయి. కాగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా హోండాతో సహా గ్లోబల్ వాహన తయారీదారులు ఇప్పటికే సంక్షోభంలో పడ్డాయి. గత నెలలో హోండా నికర లాభంలో 25.3 శాతం క్షీణతను నమోదు చేసింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు ఆరు శాతం తగ్గాయి.
గత ఏడాది మాంద్యం కారణంగా దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులకు లోనయింది. అమ్మకాలు క్షీణించడంతో పలు ఆటోమొబైల్ సంస్దలు తమ సిబ్బందిని తొలగించడం, ఉత్పత్తిని తగ్గిండం వంటి చర్యలకు శ్రీకారం చుట్టాయి. కొన్ని సంస్దలయితే తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేసాయి. ఇపుడు కొద్ది రోజులుగా లాక్ డౌన్ తో తీవ్ర సంక్షోభంలో వున్న హోండా పరిశ్రమకు తాజా సైబర్ ఎటాక్ మరింత నష్టాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

Read latest వ్యాపార వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Jan 2021
26 Jan 2021
28 Jan 2021
28 Jan 2021