Breaking News

నేపాలీ సంస్థ తో చేతులు కలుపుతున్న ఫ్లిప్ కార్ట్..!

22 nd Aug 2020, UTC

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార సంస్థ ఫ్లిప్ కార్ట్ చిన్న తరహా పరిశ్రమల రంగం లోకి కూడా అడుగు పెట్టాలని యోచిస్తోంది. ఈ నేపధ్యం లో నేపాల్‌ ఈ కామర్స్‌ దిగ్గజం సాస్టోడీల్‌తో చేతులు కలపడానికి ఫ్లిప్ కార్ట్ సిద్ధమైంది. ఇందులో భాగం గా సాస్టోడీల్‌కు చెందిన 5,000 ఉత్పత్తులను ఫ్టిప్‌కార్ట్‌ సంస్థలో నమోదు చేయనున్నారు. ఫ్లిప్‌కార్ట్ హెడ్‌ జగజీత్‌ హరోడే ఈ విషయమై స్పందించారు. ఫ్లిప్‌కార్ట్‌, సాస్టోడీల్‌ కలయికతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని.. మరో వైపు దేశీయ అమ్మకాలు కూడా వేగవంతం అవుతాయని తెలిపారు.

మరోవైపు సాస్టోడీల్‌ సీఈఓ అమున్‌ థాపా కూడా ఈ విషయమై స్పందించారు. ఫ్లిప్‌కార్ట్‌తో జోడీ వల్ల నేపాల్‌లోని వినియోగదారులకు మెరుగైన క్వాలిటీతో కూడిన ఉత్పత్తులను అందించగలుగుతామని అన్నారు. ఈ రెండు సంస్థలు కలిసి పని చేయడం వలన ఎలక్ట్రానిక్స్, హోమ్‌ అప్లెయెన్సెస్‌, ఫర్నిషింగ్స్ వంటి విభాగాల్లో మెరుగైన సేవలు అందించనున్నారు. నేపాల్‌, భారత వినియోగదారుల అభిరుచులు ఇంచు మించు ఒకే విధం గా ఉంటాయని సాస్టోడీల్‌ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌కు 2లక్షల మంది అమ్మకందార్లు ఉన్నారని ఫ్లిప్ కార్ట్ సంస్థ పేర్కొంది. జైపూర్‌, లక్నో, మీరట్‌, కాన్‌పూర్‌, కోయంబత్తూర్‌, అహ్మదాబాద్ నగరాల నుంచి ఎక్కువ ఉత్పత్తులు వస్తుంటాయని తెలిపింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox