Breaking News

"ఫెయిర్ అండ్ లవ్లీ".. పేరు తెచ్చిన తంటా..!

03 rd Jul 2020, UTC
 
                  ప్రముఖ సౌందర్య సాధనాల సంస్థ "ఫెయిర్ అండ్ లవ్లీ" తమ ప్రోడక్ట్ పేరు ను మారుస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికా లో జరిగిన వర్ణ వివక్ష కు సంబంధించిన గొడవ.. సౌందర్య సాధనలపై కూడా సెటైర్లు వేసే వరకు వెళ్ళింది.. ఈ నేపధ్యం లో "ఫెయిర్ అండ్ లవ్లీ" ని తయారు చేసే హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్) సంస్థ తమ ప్రోడక్ట్ పేరు ను మారుస్తున్నట్లు ప్రకటించింది.. అయితే.. పేరు మార్చిన తరువాత మరో కొత్త గొడవ మొదలవుతోంది.
 
                 హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్) సంస్థ "ఫెయిర్ అండ్ లవ్లీ"  పేరును 'గ్లో అండ్ లవ్‌లీ'గా మార్చడంపై  మరో సౌందర్య సాధన తయారీ సంస్థ  ఇమామీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మార్చిన పేరు తమ  కంపెని ప్రోడక్ట్ కు దగ్గరగా ఉందని  ఇమామీ అభ్యంతరం వ్యక్తం చేసింది. గ్లో అండ్ హ్యాండ్‌సమ్' పేరు తమ ప్రొడక్ట్స్‌ను పోలి వున్నందున హెచ్‌యూఎల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఇమామీ హెచ్చరించింది.హెచ్‌యూఎల్ కంటే ముందే తాము ఉత్పత్తి చేస్తున్న పురుషుల ఫెయిర్‌నెస్ క్రీమ్‌కు 'ఇమామీ గ్లో అండ్ హ్యాండ్‌సమ్' అని పేరు  పెట్టమని.. ఇమామి స్పష్టం చేసింది.
 
                ఈ విషయమై ఇటీవల స్పందించిన ఇమామి.. "హెచ్‌యూఎల్ నిర్ణయంతో మాకు షాక్ అనిపించినప్పటికీ.. ఆ కంపెనీ చేసే అన్యాయమైన వ్యాపారం మాకు తెలుసుకాబట్టి ఆశ్చర్యం కలగలేదు" అని పేర్కొంది. అమెరికాలో చోటు చేసుక్ను వర్ణవివక్ష హత్య ఉదంతం తరువాత సౌందర్య సాధనాల పేర్లపై విమర్శలు వస్తున్నా సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లో "ఫెయిర్ అండ్ లవ్లీ" పేరు మార్చడానికి ప్రయత్నిస్తోంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox