Mobile Banking: యాప్ లను డౌన్ లోడ్ చేసుకొంటున్నారా? అయితే జాగ్రత్త వహించండి అంటూ మెసేజ్ లు పంపుతున్నాయి. తమ ఖాతాదారులను పలు బ్యాంకులు అప్రమత్తం చేసాయి. అధికారిక యాప్ స్టోర్ల నుండి మాత్రమే బ్యాంకు యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవలంటూ ఖాతాదారులను హెచ్చరిస్తున్నాయి.
ట్రోజన్ వైరస్ కు చెందిన కొత్త వర్షన్ సోవా మాల్ వేర్ మొబైల్ బ్యాంకులకు సంబంధించి 200 యాప్ లను టార్గెట్ చేసాయంటూ బ్యాంకులు తమ ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నాయి. వీటి ద్వారా కస్టమర్ల లాగిన్ వివరాలతో పాటు కుకీస్ ను దొంగలించి మోసగాళ్లకు చేరవేస్తాయని బ్యాంకులు అప్రమత్తం చేస్తున్నాయి. ఇటీవల ఈ కొత్త వైరస్, యాండ్రాయిడ్ ఫోన్ ను ఎన్ క్రిప్ట్ చేస్తుందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం పేర్కొనివుంది. ఈ నేపధ్యంలో దేశంలోని పలు బ్యాంకులు తమ ఖాతాదారులను అప్రమత్తం చేసాయి. ఇప్పటివరకు హెచ్చరించిన బ్యాంకుల్లో హెచ్ డి ఎఫ్ సి, ఐడిబీఐ, కరూర్ వైశ్యా బ్యాంకులతో పాటు పలు బ్యాంకులు ఉన్నట్లు సమాచారం.