Breaking News

ఇండియాలో ఆపిల్ వన్ లాంచ్..!

31 st Oct 2020, UTC
ఇండియాలో ఆపిల్ వన్ లాంచ్..!

ఇండియాలో ఆపిల్ వన్ ను కంపెనీ లాంచ్ చేసింది. యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ+, యాపిల్ ఆర్కాడ్, ఐక్లౌడ్ స్టోరేజ్ ఇలా అన్ని సబ్ స్క్రిప్షన్లనూ యాపిల్ వన్ ఒకేసారి అందించబోతోంది. తాజాగా ఈ విషయాన్నీ యాపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రకటించారు. ఇకపై ఈ సర్వీస్ లో భారతీయులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. వ్యక్తిగత సబ్ స్క్రిప్షన్ 195 రూపాయలు ఉండగా ఫామిలీ సబ్ స్క్రిప్షన్ నెలకు రూ.365గా ఉంది. ఈ సేవలను ఇక పై భారతీయులు కూడా వినియోగించుకోవచ్చు. వ్యక్తిగత ప్లాన్‌లో యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ+, యాపిల్ ఆర్కాడ్, 50 జీబీ ఐక్లౌడ్ స్టోరేజ్ సేవలు లభిస్తాయి.

ఫామిలీ ప్లాన్ లో ఈ సేవలతో పాటు 200 జీబీ ఐక్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. ఫామిలీ షేరింగ్ లో ఈ సేవలను ఆరుగురు వ్యక్తులు పొందవచ్చు. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఇంగ్లండ్‌ దేశాలలో ప్రీమియం ప్లాన్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్లాన్ ప్రకారం యాపిల్ న్యూస్+, యాపిల్ ఫిట్‌నెస్+ కూడా అందుబాటులోకి వస్తాయి. 

యాప్ స్టోర్‌లోకి వెళ్లి మీ ప్రొఫైల్ పిక్చర్‌పై  క్లిక్ చేసిన తరువాత సబ్ స్క్రిప్షన్లపై క్లిక్ చేస్తే ట్రై ఇట్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ  'Get Apple One'ను ఎంచుకోవాలి. దీనిద్వారా ఈ సేవలను ట్రై చేసి చూడొచ్చు. ఒక ఏడాది పాటు ఉచితంగా యాపిల్ వన్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. ఆ తరువాత నుంచి సేవల కోసం పే చేయాల్సి వస్తుంది. ఐక్లౌడ్ సబ్ స్క్రిప్షన్ నెలకు రూ.75 నుంచి ప్రారంభం కానుంది. యాపిల్ వన్ వ్యక్తిగత ప్లాన్‌లో రూ.177, అలాగే ఫ్యామిలీ ప్లాన్‌లో రూ.201 ఆదా అవుతున్నాయి. విడివిడిగా సబ్ స్క్రిప్షన్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox